Share News

Marriage: వధువును తుపాకీతో కాల్చి చంపిన వరుడు.. పెళ్లి రిసెప్షన్‌లో బంధువులంతా చూస్తుండగానే..!

ABN , First Publish Date - 2023-12-01T20:36:30+05:30 IST

కళ్యాణ మంటపంలో చివరకు కట్టుకున్న భర్తే కాలయముడిగా మారడతాడని ఆ వధువు ఊహించలేకపోయింది. అతిథుల సమక్షంలో ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్న ఆమె.. అంతలోనే భర్త చేతిలో హత్యకు గురైంది. అంతవరకూ సంతోషంగా ఉన్న వరుడు ఉన్నట్టుండి..

Marriage: వధువును తుపాకీతో కాల్చి చంపిన వరుడు.. పెళ్లి రిసెప్షన్‌లో బంధువులంతా చూస్తుండగానే..!

కళ్యాణ మంటపంలో చివరకు కట్టుకున్న భర్తే కాలయముడిగా మారడతాడని ఆ వధువు ఊహించలేకపోయింది. అతిథుల సమక్షంలో ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్న ఆమె.. అంతలోనే భర్త చేతిలో హత్యకు గురైంది. అంతవరకూ సంతోషంగా ఉన్న వరుడు ఉన్నట్టుండి కోపంతో ఊగిపోయాడు. వధువుతో పాటూ ఆమె కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

థాయ్‌లాండ్‌లోని (Thailand) నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బాన్ సర్న్ చావో ఫో గ్రామానికి చెందిన జతురోంగ్ సుక్సుక్ అనే వ్యక్తికి.. కాంచన పచంతుయెక్ (38) అనే యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. శనివారం ఉయదం వీరి వివాహం జరిగింది. సాయంత్రం విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులందరితో పాటూ వధూవరుల కుటుంబ సభ్యులు కూడా మద్యం సేవించారు. వధూవరులతో పాటూ వధువు తల్లి, ఆమె సోదరి కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో వధువు బంధువులకు, వరుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా కాసేపటికి పెద్ద గొడవగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వరుడు తన కారులో నుంచి తుపాకీ బయటికి తీసి.. (groom opened fire on the bride family) వధువు, ఆమె కుటుంబ సభ్యులు తదితరులపై కాల్పులు జరిపాడు.

Viral Video: బండరాయి పైనుంచి కింద పడిపోతున్న కుర్రాడు.. కాపాడేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నాలు.. చివరకు ఏం జరిగిందంటే..!

bride.jpgviral.jpg

తుపాకీ కాల్పుల్లో వధువు తల్లి కింగ్‌థాంగ్ క్లాజోహోర్(60), సోదరి కోర్నిడా మానేటర్(37) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అతిథులు, థోంగ్ నోన్‌ఖుంతోడ్(50), బమ్రుంగ్ చతేరత్(28)లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. వీరిలో థోంగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో వివాహ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అతిథులంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వరుడుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణలో వరుడు జతురోంగ్ గత ఏడాది ఇండోనేషియాలో జరిగిన 11వ ఆసియాన్ పారా గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడని తెలిసింది. అలాగే నఖోన్ రాట్చాసిమాలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. వధువు కంటే వరుడు 15 ఏళ్ల చిన్నవాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral: ఇది ఏటీఎం కార్డు కాదండోయ్.. నిజంగా పెళ్లి కార్డే.. ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..!

Updated Date - 2023-12-01T20:36:31+05:30 IST