Share News

Viral Video: పెళ్లిలో చేస్తున్న డాన్స్‌ను సడన్‌గా ఆపేసి.. అన్నను పట్టుకుని బోరున ఏడ్చిన వధువు.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-12-05T21:57:49+05:30 IST

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే కొన్ని ఘటనలు మనసును హత్తుకునేలా ఉంటే.. మరికొన్ని ఘటనలు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. అప్పటిదాకా ఆనందంగా ఉండే వధువు... తీరా ...

Viral Video: పెళ్లిలో చేస్తున్న డాన్స్‌ను సడన్‌గా ఆపేసి.. అన్నను పట్టుకుని బోరున ఏడ్చిన వధువు.. అసలేం జరిగిందంటే..!

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే కొన్ని ఘటనలు మనసును హత్తుకునేలా ఉంటే.. మరికొన్ని ఘటనలు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. అప్పటిదాకా ఆనందంగా ఉండే వధువు... తీరా మెట్టినింటికి వెళ్లే సమయంలో చిన్న పిల్లల తరహాలో గుక్కపట్టి ఏడ్చడం.. కుటుంబ సభ్యులనే కాకుండా అతిథులందరినీ కంటతడి పెట్టిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో డాన్సు చేస్తున్న వధువు.. సడన్‌గా ఆపేసి, తన సోదరిడిని పట్టుకుని బోరున ఏడుస్తుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో స్నేహితులతో పాటూ వధువు (bride dances at the wedding) సంతోషంగా డాన్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలో అన్నాచెళ్లెళ్లకు సంబంధించిన పాట ప్లే చేస్తారు. అదే సమయంలో వధువు సోదరుడు కూడా అక్కడే డాన్స్ చేస్తుంటాడు. పాట ప్లే అవగానే అప్పటిదాకా సంతోషంగా డాన్స్ చేస్తున్న వధువు.. సడన్‌గా తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. పక్కనే ఉన్న సోదరుడిని (bride crying her brother) పట్టుకుని బోరున విలపిస్తుంది. చెల్లెలు ఏడవడం చూసి అన్న కూడా చలించిపోతాడు.

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులను అవాక్కయ్యేలా చేసిన వధువు.. కేఎఫ్‌సీ కూడా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం వెనుక..!

వధువు ఏడుస్తుండడం చూసి పక్కనే ఉన్న వారంతా ఆమెను ఓదార్చి, సంతోషంగా డాన్స్ చేయమంటూ ప్రోత్సహిస్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అన్నా, చెల్లెళ్ల బంధం అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంట్లో సోదరి లేని లోటును ఎవరూ తీర్చలేరు’’.. అంటూ మరికొందరు, ‘‘వీడియో చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి’’. అంటూ ఇంకొందరు, అలాగే వివిధ రకాల ఎమోజీలతో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. పైకొచ్చే సమయంలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఒకే ఒక్క ట్రిక్‌తో..

Updated Date - 2023-12-05T21:57:50+05:30 IST