Share News

Metro Train: బాబోయ్.. మెట్రో రైల్లో ఏందీ రచ్చ..? ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్.. వేడుక చూసిన ప్రయాణీకులు..!

ABN , First Publish Date - 2023-12-06T16:13:34+05:30 IST

ఇటీవల రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సీట్ల కోసం మహిళల పోట్లాటలు, కాలు తీసి కాలు పెట్టడానికీ స్థలం లేకున్నా..

Metro Train: బాబోయ్.. మెట్రో రైల్లో ఏందీ రచ్చ..? ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్.. వేడుక చూసిన ప్రయాణీకులు..!

ఇటీవల రైళ్లలో చోటు చేసుకునే వివిధ రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సీట్ల కోసం మహిళల పోట్లాటలు, కాలు తీసి కాలు పెట్టడానికీ స్థలం లేకున్నా ప్రయాణం చేయడం, ప్రయాణికుల మధ్య యువతీయువకులు ఉన్నట్టుండి డాన్సులు వేయడం.. ఇలా వివిధ రకాల వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఢిల్లీ మెట్రో రైల్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్ చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు.

సోషల్ మీడియోలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఈ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైల్లో సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఇద్దరు వ్యక్తుల (Clash between passengers) మధ్య ఉన్నట్టుండి గొడవ మొదలవుతుంది. అది కాస్తా కాసేపటికి పెద్ద గొడవగా మారుతుంది. చూస్తుండగానే ఇద్దరూ ఒకరిపై మకరొకరు పిడిగుద్దులు కురిపించుకునే వరకూ వెళ్తుంది. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా వేడుక చూస్తూ ఉంటారు.

Viral Video: జలకన్య వేషంలో నీటిలోకి దిగిన యువతి.. పైకొచ్చే సమయంలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఒకే ఒక్క ట్రిక్‌తో..

కొందరు ప్రయాణికులు వారిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం వినిపించుకోకుండా కొట్టుకుంటేనే ఉంటారు. తర్వాత మరికొంత మంది కలుగజేసుకుని వారికి సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణుగుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైళ్లలో ఇలాంటివి సాధారణమైపోయాయ్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విచిత్రాలన్నీ రైళ్లలోనే జరుగుతుంటాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లిలో చేస్తున్న డాన్స్‌ను సడన్‌గా ఆపేసి.. అన్నను పట్టుకుని బోరున ఏడ్చిన వధువు.. అసలేం జరిగిందంటే..!

Updated Date - 2023-12-06T16:17:52+05:30 IST