ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఈ కుర్రాడి గురించి వినగానే.. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా గుర్తుకు రావడం ఖాయం.. కాకపోతే..!

ABN, First Publish Date - 2023-06-03T18:41:55+05:30

శత్రువుల కారణంగా కిక్ బాక్సింగ్ పోటీలకు అనర్హుడవుతాడు అన్న. ఎలాగైనా అన్న ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న తమ్ముడు.. కిక్ బాక్సింగ్ నేర్చుకుని, చివరకు అన్నను దెబ్బతీసిన వారిని ఓడించి గెలిచి చూపిస్తాడు. ఇది పవన్ పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా కథ. ప్రస్తుతం ఓ కుర్రాడి గురించి తెలుసున్న వారంతా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శత్రువుల కారణంగా కిక్ బాక్సింగ్ పోటీలకు అనర్హుడవుతాడు అన్న. ఎలాగైనా అన్న ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న తమ్ముడు.. కిక్ బాక్సింగ్ నేర్చుకుని, చివరకు అన్నను దెబ్బతీసిన వారిని ఓడించి గెలిచి చూపిస్తాడు. ఇది పవన్ పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా కథ. ప్రస్తుతం ఓ కుర్రాడి గురించి తెలుసున్న వారంతా.. తమ్ముడు సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నిజ జీవిత కథ కాస్త వేరుగా ఉన్నా.. ఈ యువకుడు తీసుకున్న నిర్ణయంపై మాత్రం సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సక్సెస్‌ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

హర్యానా (Haryana) పానిపట్ పరిధి నారా గ్రామానికి చెందిన రామ్ మెహర్ అనే వ్యక్తికి గుర్మిత్, ప్రదీప్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అన్న గుర్మిత్ రెజ్లింగ్ ప్లేయర్ (wrestling player) కాగా.. తమ్ముడు ప్రదీప్ వెయిట్ లిఫ్టర్‍‌గా రాణించేవాడు. ఒలింపిక్స్‌లో (Olympics) దేశానికి ప్రాతినిథ్యం వహించి పతకం తీసుకురావాలని ప్రదీప్ నిత్యం తపించేవాడు. ఇందుకోసం రాత్రింబవళ్లూ కష్టపడేవాడు. అయితే విధి ఇతడి ఆశలపై నీళ్లు చల్లింది. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రదీప్ మృతి చెందాడు. ఇతడి మరణం వారి కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. మరోవైపు తమ్ముడి మరణాన్ని అన్న గుర్మిత్ జీర్ణించుకోలేకపోయాడు.

Snake Video: పామును ఇలా చేతిలో పట్టుకుని నడి వీధిలో వేషాలు వేశాడు.. ఒకే ఒక్క మిస్టేక్‌తో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ఎలాగైనా తమ్ముడి ఆశయాన్ని నెరవేర్చి.. అతడి ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 2016లో రెజ్లింగ్‌ను వదిలిపెట్టి.. వెయిట్ లిఫ్టింగ్‌పై (Weight lifting) దృష్టి పెట్టాడు. అంకితభావంతో కష్టపడి మొదటి ప్రయత్నంలోనే 2017లో స్కూల్ నేషనల్ ఛాంపియన్‌పిప్‌లో (school national championship) బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అనంతరం 2018లో రాష్ట్ర స్థాయిలో రజత పతకం (Silver medal) సాధించాడు. అదే సవంత్సరం గుర్మిత్.. జూనియర్ నేషనల్‌కి ఎంపికయ్యాడు. ఇందులో 89కిలోల విభాగంలో 135 కిలోలు ఎత్తి బంగారు పతకం (Gold medal) సాధించాడు. అదేవిధంగా 2019లో 96 కేజీల విభాగంలో 137 కేజీలు ఎత్తి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.

Cooler made with Drum: వారెవ్వా.. తెలివంటే నీదే బాసూ.. నీళ్ల కోసం వాడే డ్రమ్ముతో ఏకంగా కూలర్‌నే తయారు చేశాడు..!

ఇలా సాగుతున్న క్రమంలో 2020లో కరోనా లాక్‌డౌన్ (Corona Lockdown) కారణంగా ఎలాంటి పోటీలూ జరగలేదు. కరోనా సమయంలో కొడుకు ప్రాక్టీస్ కోసం అతడి తండ్రి ఇంట్లోనే అన్ని సౌకర్యాలనూ కల్పించాడు. తన మిత్రుడి సలహాలు, సూచనలు తీసుకుంటూ.. గుర్మిత్ ఇంట్లోనే ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడు. 2021లో గుర్మీత్ సీనియర్ నేషనల్ ఛాంపియన్‌పిప్‌కి ఎంపికయ్యాడు. మళ్లీ ఇందులో కూడా 96కేజీల బాడీ వెయిట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో భారత్ ఛాంపియన్ టైటిల్ గుర్మీత్ పేరిట ఉంది. ప్రపంచ ఛాంపియన్‌పిప్‌లో సత్తాచాటి తమ్ముడి కలను నెరవేర్చడంతో పాటూ దేశానికి తీర్తిప్రతిష్టలు తెస్తానని గుర్మీత్ గర్వంగా చెబుతున్నాడు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-03T18:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising