Cooler made with Drum: వారెవ్వా.. తెలివంటే నీదే బాసూ.. నీళ్ల కోసం వాడే డ్రమ్ముతో ఏకంగా కూలర్‌నే తయారు చేశాడు..!

ABN , First Publish Date - 2023-06-03T15:57:51+05:30 IST

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జూన్ ఆరంభమైనా భానుడి ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు కూలర్లు, ఏసీలను విరివిరిగా వాడుతుంటారు. అంత స్థోమత లేని వారు..

Cooler made with Drum: వారెవ్వా.. తెలివంటే నీదే బాసూ.. నీళ్ల కోసం వాడే డ్రమ్ముతో ఏకంగా కూలర్‌నే తయారు చేశాడు..!

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జూన్ ఆరంభమైనా భానుడి ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు కూలర్లు, ఏసీలను విరివిరిగా వాడుతుంటారు. అంత స్థోమత లేని వారు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు తమ ప్రతిభకు పని పెట్టి.. అందుబాటులో ఉన్న వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నీళ్ల డ్రమ్ముతో ఏకంగా కూలర్‌నే తయారు చేశాడు. ఇతడి తెలివిని చూసి నెటిజన్లు.. నీ ముందు ఇంజనీర్లు కూడా సాటిరారు బ్రదర్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్మును (Water drum) కూలర్‌గా మార్చేశాడు. ఇందుకోసం అతను.. పాత డ్రమ్ము, ఓ ఫ్యాను, మోటారు, కూలర్‌కి వినిగించే గ్రాస్ (cooler grass) వాడుకున్నాడు. డ్రమ్మును ముందు, వెనుకా కొంత భాగాన్ని కత్తిరించాడు. ఓ వైపు ఫ్యాన్ (fan) బయటికి కనిపించేలా ఫిట్ చేశాడు. తర్వాత వెనుక వైపు గ్రాస్‌ను ఏర్పాటు చేశాడు. అలాగే డ్రమ్ముకు పైభాగాన స్విచ్చులను కూడా ఫిట్ చేశాడు.

Viral Video: తలుపులు తీసే ఉన్నాయి కదా అని.. ఇంట్లోకి దూరిన ఎలుగుబంటి.. క్షణాల్లోనే బయటకు పరార్.. అసలేం జరిగిందో మీరే చూడండి..!

స్విచ్ ఆన్ చేయగానే మోటార్ సాయంతో నీళ్లు గ్రాస్‌పై పడుతుంటాయి. ఫ్యాన్ తిరగడం వల్ల చల్లటి గాలి బయటికి వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఫైనల్‌గా కూలర్‌ని మరిపించేలా చల్లటి గాలి వచ్చేటట్లుగా నీళ్ల డ్రమ్మును మార్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఐడియా భలే ఉందే’’.. అని కొందరు, ‘‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం’’.. అని మరికొందరు, ‘‘ఇతడి తెలివి ముందు ఇంజినీర్లు కూడా పనికిరారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-03T15:57:51+05:30 IST