Viral Video: తలుపులు తీసే ఉన్నాయి కదా అని.. ఇంట్లోకి దూరిన ఎలుగుబంటి.. క్షణాల్లోనే బయటకు పరార్.. అసలేం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-06-03T14:58:48+05:30 IST

అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం, ఇళ్లల్లోకి చొరబడడంతో పాటూ మనుషులపై దాడి చేసే ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. అటవీ సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రి అయిందంటే చాలు.. బిక్కుబిక్కుమంటూ...

Viral Video: తలుపులు తీసే ఉన్నాయి కదా అని.. ఇంట్లోకి దూరిన ఎలుగుబంటి.. క్షణాల్లోనే బయటకు పరార్.. అసలేం జరిగిందో మీరే చూడండి..!

అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం, ఇళ్లల్లోకి చొరబడడంతో పాటూ మనుషులపై దాడి చేసే ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. అటవీ సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రి అయిందంటే చాలు.. బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. కొన్నిసార్లు అయితే క్రూరమృగాలు పట్టపగలే పల్లెల్లోకి చొరబడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తలుపులు తీసి ఉండడంతో ఓ ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడుతుంది. అయితే క్షణాల్లోనే బయటకు పరారవుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. న్యూయార్క్‌లో (New York) ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ సమీప ప్రాంతంలోకి పట్టపగలు ఓ ఎలుగుబంటి (bear) చొరబడుతుంది. ఊరంతా కలియతిరుగుతూ ఉండగా.. తలుపు తీసి ఉన్న ఓ ఇల్లు కనిపిస్తుంది. మెల్లగా తలుపు వద్దకు వచ్చిన ఎలుగుబంటి తలుపు తీసి ఉండడంతో (bear entered into the house) లోపలికి చొరబడుతుంది. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా వారి పెంపుడు కుక్క (pet dog) గమనిస్తుంది. వెంటనే అక్కడికి వచ్చిగా గట్టిగా మొరుగుతుంది. కుక్క రాకను గమనించిన ఎలుగుబంటి వెంటనే పరుగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

ఇంటి యజమాని కంగారుగా వచ్చి డోరు మూసి, లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత కూడా ఎలుగుబంటి డోరు వద్ద కాసేపు ఉండి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చిన సమయంలో తలుపు వద్ద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెంపుడు కుక్క ఉండడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది’’.. అని కొందరు, ‘‘ఎలుగు బంటికి ఇల్లు బాగా నచ్చినట్లుంది’’.. అని మరికొందరు, ‘‘అటవీ సమీప ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-03T14:58:48+05:30 IST