Bride: వామ్మో.. ఈ పాము పెద్ద కథే నడిపిందిగా.. ఈ వధువు వద్దకు వరుడిని ఎలా రప్పించిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-06-02T14:54:01+05:30 IST

వివాహానికి ముందు, తర్వాత జరిగే వింత వింత ఘటనలకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు వధూవరులకు ఫ్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ నిర్వహించడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. ఈ సందర్భంగా సినిమా సీన్లను తలపించేలా మంచి మంచి లొకేషన్లను ఎంచుకుంటుంటారు. కొందరైతే..

Bride: వామ్మో.. ఈ పాము పెద్ద కథే నడిపిందిగా.. ఈ వధువు వద్దకు వరుడిని ఎలా రప్పించిందో మీరే చూడండి..!

వివాహానికి ముందు, తర్వాత జరిగే వింత వింత ఘటనలకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు వధూవరులకు ఫ్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ నిర్వహించడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. ఈ సందర్భంగా సినిమా సీన్లను తలపించేలా మంచి మంచి లొకేషన్లను ఎంచుకుంటుంటారు. కొందరైతే తమ ఫొటో షూట్ అందరికీ భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేసి ప్రమాదాల బారిన కూడా పడుతుండడం చూస్తున్నాం. ప్రస్తుతం వధూవరులకు సంబంధించిన ఫొటోలు.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వరుడిని ఓ పాము వధువు వద్దకు ఎలా రప్పించిందో చూసి అంతా అవాక్కతున్నారు.

త్వరలో ఒక్కటి కాబోతున్న ఓ జంటకు సంబంధించిన ఫొటో షూట్ (Photo shoot) తీస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా వధువుకు (bride) సంబంధించిన ఫొటోలు తీస్తున్నారు. తోటలో వివిధ రకాల మొక్కల మధ్య యువతి నడుస్తూ వస్తుండగా.. కెమెరామెన్ వీడియోలు, ఫొటోలు తీస్తున్నాడు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వధువు నడుస్తూ వస్తుండగా సడన్‌గా ఓ నాగుపాము (Cobra) ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూడగానే భయంతో పరుగులు పెట్టిన యువతి (young woman) .. కాబోయే భర్తకు ఫోన్ చేస్తుంది.

Bride: పెళ్లిలో పనిచేయని ఏసీ.. ఉక్కపోత భరించలేక స్నేహితులకు ఒక్క సైగ చేసిన వధువు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

bride-photos.jpg

విషయం తెలుసుకున్న వరుడు కంగారుగా అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తాడు. పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేస్తాడు. కాగా, పచ్చని గడ్డిలో ఈ జంట నిలబడి ఉండగా.. నాగు పాము వెనుక పడగ ఎత్తి, వారిద్దరినీ చూస్తున్నట్లుగా ఉన్న ఫొటో తెగ వైరల్‌గా (Viral photos) మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొత్త జంటను కలిపిన నాగరాజు’’.. అని కొందరు, ‘‘ ఫొటో షూట్ అంటే ఈ పాము ఎంతో ఇష్టం అనుకుంటా’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-02T14:57:42+05:30 IST