Wife: నా శవాన్ని ఒక్కసారి హత్తుకో.. అదే నా చివరి కోరిక.. అంటూ భార్యకు మెసేజ్ పంపిన భర్త.. 15 రోజుల క్రితమే పెళ్లయింది కానీ..!

ABN , First Publish Date - 2023-05-31T20:37:38+05:30 IST

కుటుంబ సభ్యుల కోసం కొందరు ప్రేమికులు తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. అలాగే మరికొందరు ప్రేమికులు.. కుటుంబ సభ్యులను ఒప్పింటి మరీ వివాహం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ప్రేమికులు.. ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోలేక, అలాగని మర్చిపోయి ఉండలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి..

Wife: నా శవాన్ని ఒక్కసారి హత్తుకో.. అదే నా చివరి కోరిక.. అంటూ భార్యకు మెసేజ్ పంపిన భర్త.. 15 రోజుల క్రితమే పెళ్లయింది కానీ..!

కుటుంబ సభ్యుల కోసం కొందరు ప్రేమికులు తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. అలాగే మరికొందరు ప్రేమికులు.. కుటుంబ సభ్యులను ఒప్పింటి మరీ వివాహం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ప్రేమికులు.. ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోలేక, అలాగని మర్చిపోయి ఉండలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ప్రేమ కథలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తికి ఊహించని సమస్య వచ్చి పడింది. 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ఇటీవల ‘‘నా శవాన్ని ఒక్కసారి హత్తుకో.. అదే నా చివరి కోరిక’’.. అంటూ భార్యకు మెసేజ్ పంపి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి బంగంగా ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రాహుల్ (23) అనే యువకుడికి.. ఏడేళ్ల క్రితం అతడి సమీప బంధువుల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తెలిసిన వాళ్లే కావడంతో యువతి (young woman) కూడా త్వరగా అతడికి దగ్గరైంది. ఇలా వీరి మధ్య కొన్నాళ్లకే ప్రేమ (love) మొదలైంది. తల్లిదండ్రులకు తెలీకుండా కలుసుకుంటూ ఉండేవారు. ఇటీవల ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరనే ఉద్దేశంతో పారిపోయి వెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మే 16న ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. పెళ్లి అనంతరం యువతిని తన తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆశ్చర్యకరంగా రెండు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, భర్తపైనే కేసు పెట్టింది. తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది.

Viral Video: ఇలాంటి రోడ్డును మీరు ఇంత వరకు చూసి ఉండరు.. చాపలా చుట్టేసి ఇంటికి కూడా తీసుకెళ్లిపోవచ్చు..!

అంతవరకూ తనతో సంతోషంగా ఉన్న భార్య.. సడన్‌గా ఇలా ప్రవర్తించడాన్ని రాహుల్ జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని రోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘‘నాకు బతకాలని ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది.. నేను ఎంతో ప్రేమించిన నా భార్య ఇలా చేస్తుందని అనుకోలేదు.. కనీసం నేను చనిపోయాక.. నా శవాన్ని ఒక్కసారి హత్తుకో.. అదే నా చివరి కోరిక’’.. అంటూ సూసైడ్ నోట్ రాశాడు. భార్యకు మెసేజ్ చేసిన అనంతరం వీడియో తీసుకుని తన సోదరుడు తదితరులకు పంపించి, ఆత్మహత్యకు (suicide) పాల్పడ్డాడు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో వీడియో చూడలేదని, ఉదయం చూసి ఇంటికి వెళ్లగానే ఆత్మహత్య చేసుకున్నాడని.. రాహుల్ సోదరుడు మయూర్ తెలిపాడు. రాహుల్ తండ్రి, మరో సోదరుడు కూడా గతంలో వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిసింది. రాహుల్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Viral News: చేసేదే పాడు పని.. పైగా వీడియో తీసుకున్నారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ లాయర్.. అడ్డంగా దొరికిపోయారుగా..!

Updated Date - 2023-05-31T20:37:38+05:30 IST