Viral News: కనిపించని కూతురు కోసం తండ్రి వెతుకులాట.. చివరకు పెంపుడు కుక్క వెనుకే వెళ్లగా.. నిర్మానుష్య ప్రదేశంలో షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2023-05-28T21:33:06+05:30 IST

రోజురోజుకూ చాలా మంది మనుషులు.. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దారుణాలకు తెగపడేవారు కొందరైతే.. మరికొందరు ప్రభుద్దులు వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో..

Viral News: కనిపించని కూతురు కోసం తండ్రి వెతుకులాట.. చివరకు పెంపుడు కుక్క వెనుకే వెళ్లగా.. నిర్మానుష్య ప్రదేశంలో షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

రోజురోజుకూ చాలా మంది మనుషులు.. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దారుణాలకు తెగపడేవారు కొందరైతే.. మరికొందరు ప్రభుద్దులు వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే మేలని అనిపిస్తుంటుంది. ఇటీవల బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. కనిపించని కూతురు కోసం తల్లిదండ్రులు కంగారుగా వెతుకున్నారు. వారి ఆందోళనను గమనించిన పెంపుడు కుక్క.. వారిని పిలుచుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లింది. చివరకు అక్కడి దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) అరారియాలోని కుసియార్ గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. భార్య ముగ్గురు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. సంతోషంగా ఉన్న ఈ కుటుంబంపై విధి పగ పట్టిందో ఏమో గానీ.. ఇటీవల విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి పిల్లలను ఇంట్లో పడుకోబెట్టి.. తల్లిదండ్రులు ఓ వివాహ (marriage) వేడుకకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చారు. అయితే ఇంట్లో ఉండాల్సిన ముగ్గురు కూతుళ్లలో ఐదేళ్ల అంజలి మాత్రం (girl is missing) కనిపించలేదు. ‘‘చెల్లెలు ఎక్కడికి వెళ్లింది’’.. మిగతా వారిని ప్రశ్నించగా.. రాత్రి తమతో పాటే పడుకుని ఉందని, ఎక్కడికి వెళ్లిందో తెలీదని చెప్పారు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. చుట్ట పక్కల వెతికారు. అయినా ఎక్కడా కనిపించలేదు.

Crime News: కుక్కకు ట్రైనింగ్ ఇవ్వమని యువకుడిని ఇంటికి పిలిచిన యువతి.. వంట గదిలో ఉండగా అతడు చేసిన నిర్వాకం ఏంటంటే..

అంతా కంగారు పడుతుండగా.. వారి పెంపుడు కుక్క (dog) యజమాని వద్దకు వచ్చింది. చొక్కా పట్టుకుని ఎక్కడికో లాగుతుంటే.. వారికి అనుమానం వచ్చింది. చివరికి వారిని ఓ నిర్మానుష్య ప్రదేశంలో మూసిన ఓ గొయ్యి వద్దకు తీసుకెళ్లింది. అంతా కలిసి గొయ్యి తవ్వి చూడగా.. కూతురు మృతదేహం (daughter dead body) బయటపడింది. కూతురును విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాలిక మెడపై గాయం ఉండడంతో పాటూ ప్రైవేట్ భాగంలో కూడా రక్తగాయాలు ఉండడాన్ని గమనించారు. గుర్తు తెలియని దుండగులు బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Marriage News: నెలలో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి.. కాబోయే భార్య గురించి యువకులు చెప్పింది విని షాక్.. చివరకు వధువు తండ్రికి ఫోన్ చేయడంతో..

Updated Date - 2023-05-28T21:44:38+05:30 IST