Viral Video: అమెరికా యువకుడిని ఖంగుతినిపించిన సమోసా.. దెబ్బకి ఇండియా గుర్తొచ్చి.. ఏమన్నాడో చూడండి..

ABN , First Publish Date - 2023-05-28T16:14:52+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశ విదేశాల్లో ఏం జరుగుతోంది, మనతో పోల్చుకుంటే అక్కడి జీవన విధానం ఎలా ఉంటుంది, ఆదాయం, ఖర్చుల వివరాలు.. ఇలా మొత్తం సమాచారం గురించి ఒక్క క్లిక్ చేయగానే తెలిసిపోతోంది. ప్రస్తుతం చాలా మంది తాము ఉంటున్న ప్రదేశాలకు సంబంధించిన..

Viral Video: అమెరికా యువకుడిని ఖంగుతినిపించిన సమోసా.. దెబ్బకి ఇండియా గుర్తొచ్చి.. ఏమన్నాడో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశ విదేశాల్లో ఏం జరుగుతోంది, మనతో పోల్చుకుంటే అక్కడి జీవన విధానం ఎలా ఉంటుంది, ఆదాయం, ఖర్చుల వివరాలు.. ఇలా మొత్తం సమాచారం గురించి ఒక్క క్లిక్ చేయగానే తెలిసిపోతోంది. ప్రస్తుతం చాలా మంది తాము ఉంటున్న ప్రదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అమెరికాకు చెందిన యువకుడు.. స్థానికంగా ఉన్న హోటల్‌కి వెళ్లాడు. అక్కడి సమోసా ధరను చూసి ఖంగుతిన్నాడు. దెబ్బకి ఇండియా గుర్తొచ్చి.. ఏమన్నాడో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. అమెరికాకు (America) చెందిన ఓ యువకుడు (young man) సమోసాలు తినేందుకు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కి వెళ్లాడు. అయితే ధరలకు సంబంధించిన పట్టిక చూడగానే అతడికి చుక్కలు కనించాయి. రెండు సమోసాలు (Samosa) కలిపి $7.49 (రూ.618.41) ధర ఉండడం చూసి షాక్ అయ్యాడు. అతడు గతంలో తన స్నేహితులతో కలిసి బీహార్‌కు (Bihar) వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. బీహార్‌లో రెండు సమోసాలు కలిపి రూ.20మాత్రమే అని, పైగా ఎంతో టేస్టీగా ఉన్నాయని.. అమెరికాలో మాత్రం రెండు సమోసాలకు రూ.600లు వైనే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Viral News: రాత్రి అన్నం తిన్న వెంటనే 26 ఏళ్ల యువతి మృతి.. తల్లిదండ్రులు చూస్తుండగానే ఘోరం.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు ఏం తేల్చారంటే..!

బ్రదర్.. నేను బీహార్ వస్తున్నా.. అంటూ సెల్ఫీ వీడియో (Selfie video) తీసుకుని, సోసల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియా వెలుపల దాదాపు అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి’’.. అని కొందరు, ‘‘వెల్‌కమ్ టూ ఇండియా బ్రదర్’’.. అని మరికొందరు.. వారి వారి ప్రదేశాల్లో సమోసాలు తదితర తినుబండారాల ధరలను తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Real Life ‘3 Idiots’: కార్లో వెళ్తున్న ఓ వ్యక్తి.. పక్కనే స్కూటర్‌పై జరుగుతున్న సీన్‌ను సీక్రెట్‌గా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తే..!

Updated Date - 2023-05-28T16:14:52+05:30 IST