Teachers Fighting: నీళ్ల పంపు వద్ద గొడవ కాదండోయ్.. వీళ్లు టీచర్లే.. విద్యార్థుల ముందే పిచ్చి పిచ్చిగా తన్నుకోవడం వెనుక..!

ABN , First Publish Date - 2023-05-27T14:46:58+05:30 IST

క్లాసు రూముల్లో దాడులు చేసుకునే విద్యార్థులను చాలా మందిని చూశాం. అలాగే ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే మరో వైపు.. ప్రేమాయణం సాగించే విద్యార్థులను కూడా చూశాం. తప్పు చేసిన సందర్భాల్లో మందలించే ఉపాధ్యాయులపై ఎదురుదాడులకు దిగే విద్యార్థులనూ చూస్తూ ఉంటాం. అయితే..

Teachers Fighting: నీళ్ల పంపు వద్ద గొడవ కాదండోయ్.. వీళ్లు టీచర్లే.. విద్యార్థుల ముందే పిచ్చి పిచ్చిగా తన్నుకోవడం వెనుక..!

క్లాసు రూముల్లో దాడులు చేసుకునే విద్యార్థులను చాలా మందిని చూశాం. అలాగే ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే మరో వైపు.. ప్రేమాయణం సాగించే విద్యార్థులను కూడా చూశాం. తప్పు చేసిన సందర్భాల్లో మందలించే ఉపాధ్యాయులపై ఎదురుదాడులకు దిగే విద్యార్థులనూ చూస్తూ ఉంటాం. అయితే, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే ఇలాంటి తప్పులు చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా మహిళా టీచర్లు.. వీధి రౌడీలుగా మారి పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటే ఇంకెలా ఉంటుంది. తాజాగా, బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన మహిళా టీచర్లు.. విద్యార్థుల ఎదుటే పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఇంతకీ ఈ గొడవకు కారణం ఏంటంటే..

బీహార్ (Bihar) పాట్నాలోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్లో (school) ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులంతా ఎవరి తరగతుల్లో వారు బుద్ధిగా పాఠాలు వింటున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అనితాకుమారి అనే టీచర్.. విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉంది. అదే సమయంలో ప్రధానోపాధ్యాయురాలు (Principal) కాంతికుమారి అక్కడికి వచ్చారు. కొద్ది సేపు తరగతిలో అటూ ఇటూ తిరిగి, కిటీకీ తలుపులు తెరచి ఉండడంతో.. వెంటనే మూసేయాలని టీచర్ అనితాకుమారికి ఆర్డర్ వేసింది. అయితే ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ఎంతసేపటికీ కిటికీ తలుపులు మూయకపోవడంతో.. ప్రధానోపాధ్యాయురాలికి కోపం (anger) కట్టలు తెంచుకుంది. ‘‘నేను ప్రధానోపాధ్యాయురాలిని.. నా మాటే లెక్క చేయవా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Real Life ‘3 Idiots’: కార్లో వెళ్తున్న ఓ వ్యక్తి.. పక్కనే స్కూటర్‌పై జరుగుతున్న సీన్‌ను సీక్రెట్‌గా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తే..!

ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. తర్వాత కాంతికుమారి గది నుంచి బయటకు వెళ్లే సమయంలో.. అనితాకుమారి ఆమె వెనుకే వెళ్లి ఒక్కసారిగా చెప్పు తీసుకొని కొట్టింది. ఇంతలో అనితకు మద్దతుగా మరో టీచర్ కూడా జత కలిసింది. ఎన్నాళ్ల నుంచి మనసులో పగ పెట్టుకున్నారో ఏమో గానీ.. అంతా స్కూలు ఆవరణలోని పొలాల్లోకి వెళ్లి జుట్టు పట్టుకుని (Teachers attacking each other) కొట్టుకుంటూ, కాళ్లతో తన్నుకుంటూ దాడి చేసుకున్నారు. అప్పటిదాకా హుందాగా ఉన్న టీచర్లు.. ఒక్కసారిగా వీధి రౌడీల తరహాలో కొట్టుకోవడం చూసి.. విద్యార్థులంతా నోరెళ్లబెట్టారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ దూరంగా చూస్తూ ఉండిపోయారు. ఎవరో ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-05-27T14:46:58+05:30 IST