Viral News: చిరాకొచ్చి టీ తాగేందుకు వెళ్తే.. ఆ బస్ డ్రైవర్‌కు ఏకంగా రూ.10 కోట్లు కలిసొచ్చాయ్..!

ABN , First Publish Date - 2023-05-25T21:33:54+05:30 IST

కొందరు అదే పనిగా ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోవచ్చు. మరికొందరు, ఏదో ఒక రాయి వేసి చూద్దాం.. అన్నట్లుగా ఇలా ప్రయత్నించగానే.. అలా అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే, దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. అని అనిపిస్తూ ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా తరచూ ఏదో ఒక చోట..

Viral News: చిరాకొచ్చి టీ తాగేందుకు వెళ్తే.. ఆ బస్ డ్రైవర్‌కు ఏకంగా రూ.10 కోట్లు కలిసొచ్చాయ్..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు అదే పనిగా ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోవచ్చు. మరికొందరు, ఏదో ఒక రాయి వేసి చూద్దాం.. అన్నట్లుగా ఇలా ప్రయత్నించగానే.. అలా అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే, దేనికైనా రాసిపెట్టి ఉండాలి.. అని అనిపిస్తూ ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా తరచూ ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాత్రికి రాత్రే ఓ బస్సు డ్రైవర్‌ దశ తిరిగింది. చిరాకొచ్చి టీ తాగేందుకు వెళ్లిన డ్రైవర్‌కు ఏకంగా రూ.10కోట్లు కలిసొచ్చాయి. ఇతడి గురించి తెలుసుకున్న నెటిజన్లు, అదృష్టవంతుడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. యూకేలో (UK) ఈ ఘటన చోటు చేసుకుంది. 51 ఏళ్ల స్టీవ్ గుడ్విన్ అనే వ్యక్తి.. స్థానికంగా బస్సు డ్రైవర్‌గా (Bus driver) పని చేస్తుంటాడు. అంతంతమాత్రం ఆదాయంతోనే సంసారం నెట్టుకొచ్చే ఇతడి జీవితం.. ఇటీవల ఓ రోజు అనూహ్య మలుపు తీసుకుంది. రోజూ లాగే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్లాడు. చాలా సేపు డ్రైవింగ్ చేయడంతో చిరాకు పుట్టి.. టీ తాగేందుకని ఓ షాపులోకి (Tea shop) వెళ్లాడు. అయితే టీ తయారు చేసేందుకు సమయం పడుతుందని చెప్పడంతో అంతలోగా టైంపాస్ చేద్దామని పక్కనే ఉన్న మరో షాపులోకి వెళ్లాడు. అక్కడ నేషనల్ లాటరీ టికెట్లు (Lottery tickets) అమ్ముతుండడం చూశాడు. ఓ టికెట్ తీసుకుంటే ఏం పోయిందిలే.. అనుకుంటూ వెళ్లి ఒక టికెట్ కొన్నాడు.

Marriage: పాపం.. ఈ కుర్రాడికి పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది కదా.. మామూలు రోజుల్లో అయితే ఎగిరిగంతేసేవాడే కానీ..!

lottery-viral-news.jpg

లాటరీ టికెట్‌పై స్క్రాచ్ చేసి చూడగా 73 నంబర్ కనిపించింది. అది తన లక్కీ నంబర్ (Lucky number) అని తెలుసుకుని ఎంతో సంతోషించాడు. అయితే కొన్ని గంటల్లోనే ఆ నంబర్‌కు 1మిలియన్ పౌండ్ల (సుమారు రూ.10.25కోట్లు) లాటరీ తగిలిందని తెలుసుకుని (bus driver won the lottery) ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ సంతోషంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదని సదరు డ్రైవర్ సంతోషంతో తెలిపాడు. ఆ డబ్బుతో ఉన్న అప్పులు తీర్చుకుని, కొత్త ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. ఇన్నాళ్లూ ఉద్యోగ విరమణ తర్వాత తన జీవితంపై ఆందోళన ఉండేదని, ఇక ఆ భయం లేదని స్టీవ్ గుడ్విన్ పేర్కొన్నారు. ఈ వార్త ప్రస్తుతం (Viral news) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడిని అదృష్టం వెంటాడుకుంటూ వచ్చింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-05-25T21:33:54+05:30 IST