Viral Video: అందంగా కనిపించాలన్న కోరికే.. ఆమెకు నరకాన్ని చూపించింది.. కష్టపడి ఫేస్‌మాస్క్ వేయించుకుంది కానీ..!

ABN , First Publish Date - 2023-05-25T16:06:12+05:30 IST

అందంగా కనిపించేందుకు యువతీయువకులు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. మొఖంపై ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే బ్యూటీఫార్లర్స్‌కు పరుగులు పెడుతుంటారు. వాళ్లు అడిగినంత సమర్పించుకుని మరీ వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లు వేయించుకుంటుంటారు. కొందరైతే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మరీ ఇంట్లోనే..

Viral Video: అందంగా కనిపించాలన్న కోరికే.. ఆమెకు నరకాన్ని చూపించింది.. కష్టపడి ఫేస్‌మాస్క్ వేయించుకుంది కానీ..!

అందంగా కనిపించేందుకు యువతీయువకులు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. మొఖంపై ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే బ్యూటీఫార్లర్స్‌కు పరుగులు పెడుతుంటారు. వాళ్లు అడిగినంత సమర్పించుకుని మరీ వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లు వేయించుకుంటుంటారు. కొందరైతే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మరీ ఇంట్లోనే వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇక అమ్మాయిలైతే.. ఇంట్లో కూర్చుని య్యూటూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. తదితరాల్లో వీడియోలు చూసి ఏవేవో క్రీములను తయారు చేసుకుని మొఖానికి రాసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. అందంగా కనిపించాలన్న కోరికే.. ఆమెకు నరకాన్ని చూపించింది. కష్టపడి ఫేస్‌మాస్క్ వేసుకుంటే చివరికి ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ యువతికి (young woman) సంబంధించిన వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఓ యువతి.. ఏదోటి చేసి అందంగా కినిపంచాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం బ్యూటీఫార్లర్స్‌కు (beautifuller) వెళ్లి అనవరంగా ఎందుకు ఖర్చు చేయాలని అనుకుంది. సోషల్ మీడియాలో ఉండగా భయమేలా.. అనుకుని ఆన్‌లైన్‌లో చాలా వీడియోలు చూసి, చివరకు ఓ ఫేస్ ప్యాక్ (Face pack) చేసుకునేందుకు సిద్ధమైంది. వీడియోల్లో చెప్పినట్లుగా ఏవోవే కలిపేసి.. చివరకు ఓ ఎర్రటి పేస్టు తయారు చేసుకుంది. దాన్ని మొఖంపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచుకుంది. ప్యాక్ తీయగానే మొఖం మిలామిలా మెరుస్తుందని ఎంతో ఆశపడింది.

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

అయితే ప్యాక్‌ను తీయాలని చూడగా సాధ్యం కాలేదు. ఆ ప్యాక్ మొఖానికి అంటుకుపోవడంతో ఎంత ట్రై చేసినా చర్మం మంట పుడుతుందే తప్ప.. ప్యాక్‌ను తీయడం మాత్రం సాధ్యం కాలేదు. చివరకు చర్మం మంట పుట్టడంతో గట్టిగా కేకలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అంతా కలిసి ప్యాక్‌ను తీసేందుకు ప్రయత్నిస్తారు. చివరకు ఎలాగోలా ప్యాక్‌ను పీకి పక్కన పడేస్తారు. చివరగా యువతి తన చర్మం కందిపోవడం చూసుకుని.. అనవసరంగా ప్రయోగం చేశానే.. అనుకుని బాధపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి’’.. అంటూ నెటిజన్లు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

Viral News: వయసును తగ్గించేందుకు ఏటా రూ.16 కోట్ల ఖర్చు.. కన్నకొడుకు రక్తంతోనే ప్రయోగం స్టార్ట్.. అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే..!

Updated Date - 2023-05-25T16:06:12+05:30 IST