Viral News: వయసును తగ్గించేందుకు ఏటా రూ.16 కోట్ల ఖర్చు.. కన్నకొడుకు రక్తంతోనే ప్రయోగం స్టార్ట్.. అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే..!

ABN , First Publish Date - 2023-05-25T15:28:41+05:30 IST

ప్రస్తుతం యువత తాము నిత్య యవ్వనంగా ఉండాలని కోరుకుంటుంటారు. అయితే నేటి కాలుష్య వాతావరణంలో అది సాధ్యమయ్యే పని కాదు. కొందరైతే కనీసం వృద్ధాప్యాన్ని వాయిదా వేయాలని తెగ తాపత్రయపడుతుంటారు. డబ్బున్న వారు కొందరు ఇందుకోసం లక్షలు ఖర్చు చేసి మరీ...

Viral News: వయసును తగ్గించేందుకు ఏటా రూ.16 కోట్ల ఖర్చు.. కన్నకొడుకు రక్తంతోనే ప్రయోగం స్టార్ట్.. అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే..!

ప్రస్తుతం యువత తాము నిత్య యవ్వనంగా ఉండాలని కోరుకుంటుంటారు. అయితే నేటి కాలుష్య వాతావరణంలో అది సాధ్యమయ్యే పని కాదు. కొందరైతే కనీసం వృద్ధాప్యాన్ని వాయిదా వేయాలని తెగ తాపత్రయపడుతుంటారు. డబ్బున్న వారు కొందరు ఇందుకోసం లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల చికిత్సలు చేయించుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు ఇవి అసలుకే ఎసరు తెస్తుంటాయి. మరికొందరు విదేశాలకు వెళ్లి మరీ అత్యాధునిక వైద్యం చేయించుకోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన వయసును తగ్గించుకునేందుకు ఏటా రూ.16కోట్ల ఖర్చు పెడుతున్నాడు. ఇందుకోసం కన్న కొడుకు రక్తంతోనే ప్రయోగాన్ని స్టార్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..

కాలిఫోర్నియాకు (California) చెందిన 45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ అనే వ్యక్తికి 18 ఏళ్ల టాల్మేజ్, 70 ఏళ్ల తండ్రి రిచర్డ్‌తో కలిసి ఉంటున్నాడు. జాన్సన్ స్థానికంగా ఓ కంపెనీని నడుపుతున్నాడు. ఇతడికి నిత్యం యవ్వనంగా ఉండాలనేది కోరిక. మొదటి నుంచీ జాన్సన్.. బాడీ ఫిట్‌నెస్ (Body fitness) విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే మరింత యవ్వనంగా కనిపించేందుకు ఇటీవల అతను ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల జాన్సన్ తన తండ్రి, కొడుకును తీసుకుని యూఎస్‌ (US) టెక్సాస్‌లోని ఓ క్లినిక్‌కి వెళ్లాడు.

Viral Video: ఇతడేం పెళ్లికొడుకు బాబోయ్.. వధువు అంత కష్టపడి డాన్స్ చేస్తోంటే ఇతడు చేసిన నిర్వాకమేంటో మీరే చూడండి..!

trending-news.jpg

వైద్యులతో మాట్లాడి చివరకు కొడుకు రక్తాన్ని వినియోగించి తన వయసును తగ్గించేలా చికిత్స చేయించుకున్నాడు. ఇందుకోసం కొడుకు నుంచి వివిధ దపాలుగా లీటర్ రక్తాన్ని సేకరించారు. దాన్నుంచి ఎర్ర రక్తకణాలు (Red blood cells), తెల్ల రక్తకణాలు (White blood cells) , ప్లేట్‌లెట్లు.. ఇలా వేరు చేశారు. ప్లాస్మా చికిత్స (plasma treatment) కోసం జాన్సన్ రక్తాన్ని కూడా సేకరించారు. అనంతరం కొడుకు రక్తాన్ని జాన్సన్ సిరల్లోకి ఎక్కించారు. జాన్సన్ తండ్రితో కూడా ఇలాగే చేయించారు. ఇలా మూడు తరాల మధ్య రక్త మార్పిడి చేశారు. ఈ చికిత్స కోసం జాన్సన్.. సుమారు రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

viral.jpg

జాన్సన్ మాట్లాడుతూ ‘‘ నాకు 37ఏళ్ల వయసున్న గుండె, 28 ఏళ్ల వయసు గల చర్మం ఉంది.. నా ఊపిరితిత్తులు, ఫిట్‌నెస్ స్థాయి మాత్రం 18 ఏళ్ల బాలుడిలా ఉంది’’.. అని తెలిపాడు. ఇందుకోసం ప్రత్యేకమైన సప్లిమెంట్లు, మందులు తీసుకుంటున్నట్లు జాన్సన్ వివరించాడు. ఈ చికిత్సపై వైద్యులు మాట్లాడుతూ ఈ చికిత్స నిజంగా పని చేస్తుందని భావించడం లేదని చెప్పారు. వయసు తగ్గుతుంది అనడానికి సరైన ఆధారాలు, రుజువులు ఏవీ లేవన్నారు. అలాగే ఇలాంటి చికిత్స ప్రమాదకరమైనదని కూడా వారు పేర్కొన్నారు.

Marriage: పాపం.. ఈ కుర్రాడికి పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది కదా.. మామూలు రోజుల్లో అయితే ఎగిరిగంతేసేవాడే కానీ..!

Updated Date - 2023-05-25T15:28:41+05:30 IST