Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-05-24T15:01:46+05:30 IST

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ.. కళ్ల ముందున్న వస్తువులతోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. పనికిరావని పక్కన పడేసే వస్తువులను కూడా తిరిగి వినియోగంలోకి తెస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ‘‘అరె! మనకెందుకు రాలేదు ఇలాంటి ఐడియా’’.. అని ..

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ.. కళ్ల ముందున్న వస్తువులతోనే అద్భుతాలు సృష్టిస్తుంటారు. పనికిరావని పక్కన పడేసే వస్తువులను కూడా తిరిగి వినియోగంలోకి తెస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ‘‘అరె! మనకెందుకు రాలేదు ఇలాంటి ఐడియా’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డు పక్కన పడి ఉన్న సోఫా ఖరీదు చూసిన యువతి.. చివరకు అదిరిపోయే ప్లాన్ వేసింది. ఈమె తెలివితేటలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన అమాండా జాయ్ అనే యువతి (young woman) ఓ రోజు వర్షంలో వీధుల్లో నడుస్తూ వెళ్తుండగా రోడ్డు పక్కన పాడుపడిన సోఫా (old sofa) పడి ఉండడాన్ని గమనించింది. దాని వద్దకు వెళ్లి.. కాసేపు తేరిపారా చూసింది. తర్వాత దానిపై ఉన్న చెత్తాచెదారాన్ని కింద పడేసి.. చివరగా ఆ సోఫా ధరకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌‌లో (Online) చెక్ చేసింది. అలాంటి సోఫా ఖరీదు సుమారు $8,000 (రూ.6.5 లక్షలు) ఉండడం చూసి షాక్ అయింది. అంత ఖరీదు చేసే సోఫా.. ఇలా వృథాగా పడి ఉండడం ఆమెకు నచ్చలేదు. వెంటనే అదిరిపోయే ప్లాన్ వేసింది. తన కుటుంబ సభ్యులను పిలిపించి, సోఫాను ఓ ప్రదేశానికి తరలించింది.

Viral Video: నది ఒడ్డున ఉన్న బాలికను.. నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. కూతురిని కాపాడుకునేందుకు తల్లి ఏం చేసిందంటే..

తర్వాత స్నేహితులతో కలిసి సోఫాను శుభ్రం చేసింది. చాలా సేపు శ్రమించి ఎట్టకేలకు సోఫాను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఫైనల్‌గా షోరూం నుంచి తెచ్చిన సోఫా తరహాలో సిద్ధం చేసింది. అనంతరం సోఫాను తన ఇంటికి తీసుకెళ్లి, అందంగా అలంకరించింది. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ సోఫాలోని బొద్దింకలకు.. కొత్త ఆవాసం దొరికింది’’.. అని కొందరు, ‘‘ఈ యువతి ప్లాన్ అదిరిపోయింది’’.. అని మరికొందరు, ‘‘సోఫాను తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అర్ధరాత్రి వేణువులను విక్రయిస్తున్న.. ఈ వ్యక్తి జేబులోని డబ్బులు చూసి.. షాక్ అవుతున్న నెటిజన్లు..

Updated Date - 2023-05-24T15:01:46+05:30 IST