Viral Video: నది ఒడ్డున ఉన్న బాలికను.. నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. కూతురిని కాపాడుకునేందుకు తల్లి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-05-23T19:56:40+05:30 IST

మొసలి బారిన పడి ప్రాణాలతో బయటపడడం సాధ్యమేనా.. అంటే చాలా కష్టం అని ఎవరైనా చెబుతారు. పెద్ద పెద్ద జంతువులే వాటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా చూశాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...

Viral Video: నది ఒడ్డున ఉన్న బాలికను.. నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. కూతురిని కాపాడుకునేందుకు తల్లి ఏం చేసిందంటే..

మొసలి బారిన పడి ప్రాణాలతో బయటపడడం సాధ్యమేనా.. అంటే చాలా కష్టం అని ఎవరైనా చెబుతారు. పెద్ద పెద్ద జంతువులే వాటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా చూశాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మొసలి దాడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. నది ఒడ్డున ఉన్న బాలికపై ఓ మొసలి అమాంతం దాడి చేసింది. నదిలోకి లాక్కెళ్తుండగా బాలిక తల్లి గమనించి చివరికి ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మలేషియాలోని (Malaysia) సెలంగర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ నడి ఒడ్డున ఓ మహిళ (woman) , తన కూతురితో కలిసి నిలబడి ఉంది. అదే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. నది ఒడ్డున గడ్డి పొదల్లో మాటు వేసి ఉన్న మొసలి.. సడన్‌గా బాలికపై (crocodile attacked the girl) దాడి చేసింది. ఆమె కాలు పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలాగైనా తన కూతురిని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించింది. ముందూ వెనుకా చూడకుండా వెంటనే నీటిలోకి దూకి మొసలితో పోరాడింది. ఈ క్రమంలో వీరి కేకలు విన్న స్థానికులు.. అక్కడికి పరుగెత్తుంటూ వచ్చారు. చివరకు అంతా కలిసి మొసలి బారి నుంచి వారిని కాపాడారు.

IVF: ఐవీఎఫ్‌ ట్రీట్మెంట్‌కు వెళ్లిన ఓ 33 ఏళ్ల మహిళకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రి నుంచి భర్తకు ఫోన్.. అవతలి వాళ్లు చెప్పింది విని..

మొసలి దాడిలో తల్లీకూతుళ్ల కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. అనంతరం చాలా సేపు శ్రమించి అంతా కలిసి మొసలిని బంధించారు. తాళ్లతో బంధించి బోటుకు కట్టుకుని నది ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో మొసలిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమికూడారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral video) వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదు’’.. అని కొందరు, ‘‘ఈ తల్లి ధైర్యానికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అర్ధరాత్రి వేణువులను విక్రయిస్తున్న.. ఈ వ్యక్తి జేబులోని డబ్బులు చూసి.. షాక్ అవుతున్న నెటిజన్లు..

Updated Date - 2023-05-23T19:56:40+05:30 IST