Viral Video: కోబ్రాకు చుక్కలు చూపించిన కోతి.. కాటు నుంచి తప్పించుకుంటూనే చివరకు ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-05-21T15:23:46+05:30 IST

కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైన పామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేన్నైనా అది ఒక్కసారి కాటేసిందంటే ఇక దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి భయంకరమైన కోబ్రాను కూడా కొందరు ఆటాడిస్తుంటారు. మరికొందరైతే ..

Viral Video: కోబ్రాకు చుక్కలు చూపించిన కోతి.. కాటు నుంచి తప్పించుకుంటూనే చివరకు ఏం చేసిందో చూడండి..

కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైన పామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేన్నైనా అది ఒక్కసారి కాటేసిందంటే ఇక దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి భయంకరమైన కోబ్రాను కూడా కొందరు ఆటాడిస్తుంటారు. మరికొందరైతే కోబ్రా పడగ మీద ముద్దు పెట్టి మరీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక పాములు, వివిధ రకాల జంతువుల మధ్య కొన్నిసార్లు సరదా ఘటనలు, మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కోతి, కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాటేయడానికి వచ్చిన కోబ్రాకు ఓ కోతి చుక్కలు చూపించింది. దాని కాటు నుంచి తప్పించుకుంటూనే చివరకు ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో కోతి, కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతిని తాడుతో కట్టేసి ఉంటారు. అంతలో ఓ కింగ్ కోబ్రా (King Cobra) అటుగా వెళ్తుంది. కోతిని (monkey) చూడగానే పడగ విప్పి బుస కొడుతుంది. పడగ ఎత్తిన కోబ్రాను చూడగానే కోతి ఎలెర్ట్ అవుతుంది. ముందుగా తల కిందకు పెట్టి కోబ్రాను వెక్కిరిస్తుంది. తర్వాత దాని ముందు కోతి చేష్టలు చేస్తూ తికమకపెడుతుంది. పాము దగ్గరకు కాలు చాపి.. వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. కాటు వేద్దామని చూసేలోపు సడన్‍‌గా పక్కకు తప్పుకొంటుంది. ఇలా చాలా సేపు అటూ ఇటూ తిరుగుతూ కోబ్రాకు చుక్కలు చూపిస్తుంది.

Gambling: భార్యను పందెం కాసి జూదం ఆడాడు.. చివరకు జరగకూడని ఘోరం జరిగిపోయింది..!

చివరకు పాముకు కోపం వచ్చి కోతిపై బుసలు (king cobra attacked monkey) కొడుతుంది. అయితే కాటు నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి.. కోబ్రాను రక్కుతూ పక్కకు తోసేస్తుంది. అయితే కోతిని కట్టేసి ఉంచడం వల్ల పక్కకు వెళ్లే అవకాశం ఉండదు. చాలా సేపు రెండింటి మధ్య పోట్లాట జరుగుతుంది. అయితే చివరకు కోతి దాటికి తట్టుకోలేక.. కోబ్రా అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘అయ్యో! కోతిని కాటు వేయలేదు కదా’’.. అని కొందరు, ‘‘కోతిని బంధించి ఇలా వేడుక చూడడం చాలా తప్పు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

woman crime: పని పనిషి వాట్సప్ డీపీ చూడగానే భార్యకు అనుమానం.. ఫొటోను మరింత జూమ్ చేయగా.. షాకింగ్ సీన్.. చివరకు ఏం తేలిందంటే..

Updated Date - 2023-05-21T15:23:46+05:30 IST