Old Man: పోలీస్ స్టేషన్‌కు 62 ఏళ్ల వృద్ధుడు.. ఏమైంది పెద్దాయనా అంటూ పోలీసులు అడిగితే ఏడుస్తూ అతడు చెప్పింది విని..!

ABN , First Publish Date - 2023-05-20T18:11:03+05:30 IST

పిల్లలు చేతికొచ్చారని 62 ఏళ్ల ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఉద్యోగ విరమణ చేసిన అతను.. పిల్లలు తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారులే అని ధైర్యంగా ఉండేవాడు. అయితే పిల్లలు మాత్రం తండ్రిపై కపట ప్రేమ చూపించేవారు. అంతటితో ఆగకుండా అంతా కలిసి కుట్ర పన్నారు. ఈ క్రమంలో..

Old Man: పోలీస్ స్టేషన్‌కు 62 ఏళ్ల వృద్ధుడు.. ఏమైంది పెద్దాయనా అంటూ పోలీసులు అడిగితే ఏడుస్తూ అతడు చెప్పింది విని..!
ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు చేతికొచ్చారని 62 ఏళ్ల ఆ తండ్రి ఎంతో సంతోషించాడు. ఉద్యోగ విరమణ చేసిన అతను.. పిల్లలు తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారులే అని ధైర్యంగా ఉండేవాడు. అయితే పిల్లలు మాత్రం తండ్రిపై కపట ప్రేమ చూపించేవారు. అంతటితో ఆగకుండా అంతా కలిసి కుట్ర పన్నారు. ఈ క్రమంలో ఓ రోజు డబ్బులు అవసరం ఉండి బ్యాంక్‌కు వెళ్లిన తండ్రికి షాకింగ్ వార్త తెలిసింది. తన ఖాతాలోంచి రూ.8లక్షలు మాయమవడం చూసి ఖంగుతిన్నాడు. చివరకు విచారించగా ఏం తెలిసిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్ పరిధి గుల్హారియా సమీపంలోని మొగ్లాహా ప్రాంతానికి చెందిన 62ఏళ్ల రామ్ సేవక్ అనే వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు మందుల దుకాణంలో పని చేస్తుండగా, చిన్న కొడుకు ఓ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తుంటాడు. కుమార్తె ప్రస్తుతం చదువుకుంటోంది. రామ్ సేవక్ విద్యుత్ శాఖలో (Electricity Department) పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఇతడికి పిల్లలంటే ఎంతో ఇష్టం. అయితే పిల్లలు మాత్రం పైపై ప్రేమ చూపించేవారు. తండ్రి పింఛన్, బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఎలాగైనా వాడుకోవాలని కుట్ర పన్నారు. ఈ క్రమంలో ఓ రోజు పెద్ద కొడుకు, కూతురు కలిసి పక్కా ప్లాన్ ప్రకారం తండ్రి వద్దకు వెళ్లారు.

Crime News: మా పక్కింట్లోంచి విపరీతంగా దుర్వాసన వస్తోంది.. తాళం వేసి ఉందంటూ పోలీసులకు వచ్చిందో ఫోన్.. వెళ్లి చూస్తే..!

తండ్రితో.. ‘‘నాన్నా! నీకు కావాల్సిన మందులను తీసుకొస్తాం’’.. అని చెప్పడంతో.. రామ్ సేవక్ వారికి చెక్కుపై రూ.8వేలు రాసి ఇచ్చాడు. అయితే తర్వాత వారిద్దరూ కలిసి దాన్ని రూ.8లక్షలుగా మార్చి, మార్చిలో బ్యాంకులోని నగదును విత్‌డ్రా (Cash withdrawal) చేసుకున్నారు. రెండు నెలల అనంతరం వృద్ధుడికి డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే ఖాతా ఖాలీ అవడం చూసి షాక్ అయ్యాడు. చివరకు విషయం తెలుసుకుని కొడుకు, కూతురిని మందలించాడు. ఎవరికైనా చెబితే విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తామని వారు హెచ్చరించారు. ప్రేమగా చూసుకున్న పిల్లలే ఇలా మోసం చేయడంతో (Children cheat their father) తట్టుకోలేకపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వృద్ధుడి సమస్య విని పోలీసులు కూడా చలించిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-20T18:11:03+05:30 IST