Viral Video: బైకు బస్సును మోయడం చూసి అవాక్కయ్యారు.. చివరకు డ్రైవర్ చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

ABN , First Publish Date - 2023-05-21T16:13:06+05:30 IST

వేగంగా వెళ్తున్న ఓ బస్సుకు ముందు వైపు బైకు ఉండడం చూసి వాహనదారులు అంతా షాక్ అయ్యారు. బస్సును బైకు మోస్తుందేమో అని ముందు అనుకున్నారు. చాలా మంది దాని వెంటపడి మరీ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో అసలు విషయం తెసుకుని బస్సును ఆపాలని చూసినా..

Viral Video: బైకు బస్సును మోయడం చూసి అవాక్కయ్యారు.. చివరకు డ్రైవర్ చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

వేగంగా వెళ్తున్న ఓ బస్సుకు ముందు వైపు బైకు ఉండడం చూసి వాహనదారులు అంతా షాక్ అయ్యారు. బస్సును బైకు మోస్తుందేమో అని ముందు అనుకున్నారు. చాలా మంది దాని వెంటపడి మరీ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో అసలు విషయం తెసుకుని బస్సును ఆపాలని చూసినా డ్రైవర్ వినిపించుకోలేదు. చాలా దూరం వెంబడించి ఎట్టకేలకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఎటా జిల్లా కొత్వాలి నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గోశాల సమీపంలోని రోడ్డుపై ఫజల్‌గంజ్ డిపోకు చెందిన ఓ బస్సును చూసి స్థానికులు, వాహనదారులు షాక్ అయ్యారు. రన్నింగ్‌లో ఉన్న బస్సుకు ముందు వైపు బైకు ఉండడం చూసి వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. మొదట బైకు బస్సును మోస్తోందని అనుకున్నారు. తీరా అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. వేగంగా వస్తున్న సదరు బస్సు (bus hit bike) ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే భయపడిపోయిన డ్రైవర్.. బస్సును ఆపకుండా సుమారు 12 కిలోమీటర్ల మేర వేగంగా వెళ్లాడు.

woman crime: పని పనిషి వాట్సప్ డీపీ చూడగానే భార్యకు అనుమానం.. ఫొటోను మరింత జూమ్ చేయగా.. షాకింగ్ సీన్.. చివరకు ఏం తేలిందంటే..

బస్సు బలంగా ఢీనడంతో బైకు ముందు వైపు ఇరుక్కుపోయింది. అయినా అలాగే వెళ్లడంతో రోడ్డుపై వాహనదారులంతా.. ఏం జరుగుతోందో అర్థం కాక షాక్ అయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకుని బస్సును ఆపాలని ప్రయత్నించినా డ్రైవర్ ఆపలేదు. ఎట్టకేలకు స్థానిక పిలువా పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఆని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral video) వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు బస్సు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కోబ్రాకు చుక్కలు చూపించిన కోతి.. కాటు నుంచి తప్పించుకుంటూనే చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-05-21T16:13:06+05:30 IST