Curly Hair కోసమంటూ బ్యూటీ సెలూన్‌కు వెళ్లిన ఈ మహిళకు ఇలా జరిగిందేంటి..? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు విని..!

ABN , First Publish Date - 2023-05-23T17:24:34+05:30 IST

ఉన్న నాలుకకు మందు వేస్తే.. కొండనాలుక ఊడిన చందంగా.. కొన్నిసార్లు ఏదో అనుకుంటే చివరకు ఇంకేదో జరుగుతుంటుంది. ఇటీవల యువత అందంగా ఉండాలనే ఉద్దేశంతో సెలూన్‌లలో ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడడం లేదు. ఇక మహిళల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హెయిర్ స్టయిల్ దగ్గర నుంచి ..

Curly Hair కోసమంటూ బ్యూటీ సెలూన్‌కు వెళ్లిన ఈ మహిళకు ఇలా జరిగిందేంటి..? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు విని..!
ప్రతీకాత్మక చిత్రం

ఉన్న నాలుకకు మందు వేస్తే.. కొండనాలుక ఊడిన చందంగా.. కొన్నిసార్లు ఏదో అనుకుంటే చివరకు ఇంకేదో జరుగుతుంటుంది. ఇటీవల యువత అందంగా ఉండాలనే ఉద్దేశంతో సెలూన్‌లలో ఎంత ఖర్చుచేయడానికైనా వెనుకాడడం లేదు. ఇక మహిళల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హెయిర్ స్టయిల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టయిల్ వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటూ పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ఉవ్విల్లూరుతుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మొదటికే మోసం జరుగుతుంటుంది. తాజగా, ఛండీగఢ్‌లో ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. Curly Hair కోసమంటూ బ్యూటీ సెలూన్‌కు వెళ్లిన ఈ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. చివరకు డాక్టర్లు చెప్పింది విని షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..

ఛండీగఢ్‌లోని (Chandigarh) ఖరాక్ ప్రాంతానికి చెందిన సీమా శర్మ అనే మహిళకు (woman) విచిత్ర అనుభవం ఎదురైంది. 2021 ఫిబ్రవరి 18న ఆమె స్థానికంగా ఉన్న ఓ సెలూన్‌కి వెళ్లింది. రింగు రింగు జుట్టు (Curly Hair) చేయించుకోవడం కోసం రూ.3,000లు చెల్లించింది. అయితే అనంతరం సెలూన్ (Salon) వారు ఆమెకు ఎలాంటి రసీదూ ఇవ్వలేదు. అయితే కొన్ని వారాల్లోనే రింగుల జుట్టు కాస్తా సాధారణ స్థితికి వచ్చింది. దీనికి తోడు జుట్టంతా గరుకుగా (Hair is damaged) మారి దెబ్బతింది. దీంతో అవాక్కయిన మహిళ.. సెలూన్‌కి వెళ్లి తన సమస్యను వివరించింది. దీంతో జుట్టును సరి చేస్తామంటూ సెలూన్ నిర్వాహకులు మళ్లీ ఆమె నుంచి.. షాంపూ చేయడానికి రూ.3000, హెయిర్ సిట్టింగ్‌కు రూ.1,500 డిమాండ్ చేశారు.

Viral News: రోడ్డుపై కుక్కతో కలిసి కూర్చుని ఏడుస్తున్న మహిళ.. గమనించిన ఆటో డ్రైవర్ చివరికి ఏం చేశాడంటే..

అయితే వారు అడిగిన మొత్తం ఇచ్చేందుకు సదరు మహిళ నిరాకరించింది. దీంతో సెలూన్ వారు కూడా తమకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించారు. నిపుణులను సంప్రదించగా.. పాడయిన జుట్టును సరిచేయాలంటే సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు సెలూన్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో మహిళ చివరకు వినియోగదారుల హక్కుల ఫోరం‌ను (Consumer Rights Forum) ఆశ్రయించింది. మహిళ జుట్టును పాడు చేసిందుకు గాను.. నష్ట పరిహారంగా రూ.1లక్ష చెల్లించాలని (One lakh compensation) సెలూన్ నిర్వాహకులను ఫోరం ఆదేశించింది. కాగా, ప్రస్తుతం ఈ మహిళకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

IVF: ఐవీఎఫ్‌ ట్రీట్మెంట్‌కు వెళ్లిన ఓ 33 ఏళ్ల మహిళకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రి నుంచి భర్తకు ఫోన్.. అవతలి వాళ్లు చెప్పింది విని..

Updated Date - 2023-05-23T17:24:34+05:30 IST