Crime News: భార్యాభర్తల గొడవలు చూసి యువకుడి సలహా.. ఓ రోజు మహిళను గెస్ట్ హౌస్‌కి పిలిచి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

ABN , First Publish Date - 2023-05-21T17:37:03+05:30 IST

భార్యాభర్తల మధ్య తలెత్తే గొడవలను నాలుగు గోడలు దాటక ముందే పరిష్కరించుకోవాలి. అయితే కొన్ని కుటుంబాల్లో తలెత్తే గొడవలు చివరకు గ్రామ పెద్దల వరకూ వెళ్తుంటాయి. అక్కడా పరిష్కారం కాని పక్షంలో చివరకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకూ వెళ్తుంటాయి. ఈ క్రమంలో..

Crime News: భార్యాభర్తల గొడవలు చూసి యువకుడి సలహా.. ఓ రోజు మహిళను గెస్ట్ హౌస్‌కి పిలిచి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తల మధ్య తలెత్తే గొడవలను నాలుగు గోడలు దాటక ముందే పరిష్కరించుకోవాలి. అయితే కొన్ని కుటుంబాల్లో తలెత్తే గొడవలు చివరకు గ్రామ పెద్దల వరకూ వెళ్తుంటాయి. అక్కడా పరిష్కారం కాని పక్షంలో చివరకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకూ వెళ్తుంటాయి. ఈ క్రమంలో చాలా మంది విడాకుల వరకూ వెళ్తుంటారు. అయితే భార్యాభర్తల గొడవలను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. ఈ క్రమంలో చివరకు ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. ఇటీవల రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. భార్యాభర్తల గొడవలు చూసి ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. ఓ రోజు మహిళను గెస్ట్ హౌస్‌కి పిలిచి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే వీరికి పెళ్లయిన కొత్తలో ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఉండగా.. భార్యకు స్థానికంగా ఉండే ముషీర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అనంతర కాలంలో దంపతులు జైపూర్ (Jaipur) వచ్చి స్థిరపడ్డారు. ఇదిలావుండగా, 2020లో ముషీర్ జైపూర్ వచ్చాడు. ఇదే సమయంలో ఇక్కడ ఉంటున్న దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న ముషీర్.. విడాకులు తీసుకోవాలంటూ భార్యకు సలహా ఇచ్చాడు. పదే పదే ఇదే సలహా ఇస్తుండడంతో చివరికి ఈ విషయం భర్తకు తెలిసింది.

Viral Video: బైకు బస్సును మోయడం చూసి అవాక్కయ్యారు.. చివరకు డ్రైవర్ చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

దీంతో తన భార్యను తీసుకుని స్థానిక జగత్‌పురాకు వెళ్లాడు. అయినా వదలని ముషీర్.. ఇటీవల అక్కడికి వెళ్లి, అర్జంట్‌గా మాట్లాడాలంటూ మహిళను జవహర్ సర్కిల్‌లోని గెస్ట్ హౌస్‌కి పిలిచాడు. అక్కడికి వచ్చిన మహిళతో మాట్లాడుతూ.. మధ్యలో మత్తు మందు కలిపిన టీ ఇచ్చాడు. అది తాగిన ఆమె కాసేపటికి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారానికి (Indecent behavior) పాల్పడడమే కాకుండా వీడియో కూడా తీసుకున్నాడు. మెలకువలోకి వచ్చిన మహిళకు వీడియో చూపించి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇలా సుమారు రూ.1లక్ష వరకు వసూలు చేశాడు. చివరకు ఈ విషయం భర్తకు తెలియజేయడంతో ముషీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అశ్లీల వీడియోలను భర్త స్నేహితుడికి పంపాడు. దీంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: కోబ్రాకు చుక్కలు చూపించిన కోతి.. కాటు నుంచి తప్పించుకుంటూనే చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-05-21T17:37:03+05:30 IST