Viral News: బతికున్న పాము తలపై కూల్ డ్రింక్ పోసి నమిలేసిన యువకుడు.. చుట్టు పక్కల వారంతా వచ్చి చూడగా.. చివరకు..

ABN , First Publish Date - 2023-05-23T21:44:37+05:30 IST

పామును చూస్తేనే చాలా మంది ఆమడదూరం పారిపోతారు. మరికొందరు ఇందకు విరుద్ధంగా పామును పట్టుకోవాలని చూస్తారు. ఇంకొందరు ఏకంగా.. పాముతోనే ఆటలు ఆడుతుంటారు. కొందరు మందుబాబులైతే .. ఇంకో అడుగు ముందుకేసి పామును మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసేందుకు..

Viral News: బతికున్న పాము తలపై కూల్ డ్రింక్ పోసి నమిలేసిన యువకుడు.. చుట్టు పక్కల వారంతా వచ్చి చూడగా.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

పామును చూస్తేనే చాలా మంది ఆమడదూరం పారిపోతారు. మరికొందరు ఇందకు విరుద్ధంగా పామును పట్టుకోవాలని చూస్తారు. ఇంకొందరు ఏకంగా.. పాముతోనే ఆటలు ఆడుతుంటారు. కొందరు మందుబాబులైతే .. ఇంకో అడుగు ముందుకేసి పామును మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసేందుకు హీరోయిజం తరహాలో ఉన్నా.. కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బతికున్న పాము తలపై ఓ వ్యక్తి కూల్ డ్రింక్ పోసి నమిలేశాడు. చుట్టు పక్కల వారంతా వచ్చి చూసి షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరాఖండ్‍‌ (Uttarakhand) నైనిటాల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నగీనా కాలనీకి చెందిన 34ఏళ్ల కమలేష్ అనే వ్యక్తి.. మద్యానికి బానిస (Alcoholic) అయ్యాడు. ఇలావుండగా, మే 18న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అక్రమ కట్టడాలను (Illegal constructions) అధికారులు కూల్చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కమలేష్ ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నాడు. ఓ పాత ఇంటిని కూల్చేస్తున్న క్రమంలో సడన్‌గా ఓ పాము (snake) రాళ్ల మధ్యలో నుంచి బయటికి వచ్చింది. దాన్ని చూసిన కమలేష్.. వెంటనే చేత్తో పట్టుకుని (man chewed a snakes head) తల కొరికేశాడు. రక్తం కారుతున్న తల మీద కూల్‌డ్రింక్ (Cooldrink) పోసి నమిలేశాడు.

Viral Video: నది ఒడ్డున ఉన్న బాలికను.. నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. కూతురిని కాపాడుకునేందుకు తల్లి ఏం చేసిందంటే..

ఇంతలో అక్కడి చేరుకున్న జనం.. కమలేష్ నిర్వాకం చూసి ఖంగుతిన్నారు. ‘‘అది విష సర్పం.. ఇలా కొరికితే ప్రాణాలు పోతాయ్’’.. అని హెచ్చరించడంతో చివరకు ఉమ్మేశాడు. అయితే అప్పటికే పాము మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కమలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని జైలుకు తరలించారు. కమలేష్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Preservation Act) కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అర్ధరాత్రి వేణువులను విక్రయిస్తున్న.. ఈ వ్యక్తి జేబులోని డబ్బులు చూసి.. షాక్ అవుతున్న నెటిజన్లు..

Updated Date - 2023-05-23T21:44:37+05:30 IST