Marriage: పాపం.. ఈ కుర్రాడికి పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది కదా.. మామూలు రోజుల్లో అయితే ఎగిరిగంతేసేవాడే కానీ..!

ABN , First Publish Date - 2023-05-24T15:47:26+05:30 IST

పెళ్లిళ్లలో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వధూవరులతో పాటూ అతిథులందరి మొఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుంటుంది. ఓ వైపు స్నేహితుల అల్లరి, మరోవైపు అతిథుల పలకరింపులు.. ఇలా కార్యక్రమం ఆద్యంతం ఖుషీ ఖషీగా సాగిపోతుంటుంది. అలాగే..

Marriage: పాపం.. ఈ కుర్రాడికి పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది కదా.. మామూలు రోజుల్లో అయితే ఎగిరిగంతేసేవాడే కానీ..!

పెళ్లిళ్లలో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వధూవరులతో పాటూ అతిథులందరి మొఖాల్లో ఆనందం వెల్లువిరుస్తుంటుంది. ఓ వైపు స్నేహితుల అల్లరి, మరోవైపు అతిథుల పలకరింపులు.. ఇలా కార్యక్రమం ఆద్యంతం ఖుషీ ఖషీగా సాగిపోతుంటుంది. అలాగే వధూవరులు కూడా స్నేహితులతో కలిసి డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వరుడికి వింత సమస్య వచ్చి పడింది. పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నన్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో చాలా మంది తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. దీంతో బ్యాంకుల్లో క్యూలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ వివాహానికి సంబంధించిన వరుడి ఫొటో (Wedding viral photo) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో వెళ్లి మార్చుకునే కష్టం లేకుండా వినూత్నంగా ఆలోచించారు.

Viral Video: అర్ధరాత్రి వేణువులను విక్రయిస్తున్న.. ఈ వ్యక్తి జేబులోని డబ్బులు చూసి.. షాక్ అవుతున్న నెటిజన్లు..

bride-groom-viral-photos.jpg

నోట్లను మార్చుకునేందుకు ఓ వివాహాన్ని వేదికగా మార్చుకున్నారు. అంతా కలిసి తమ వద్ద నోట్లతో (garland of currency notes) పెద్ద దండ తయారు చేసి వరుడి మెడలో వేశారు. ఈ నోట్లను చూసి వరుడికి (groom) నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. పెళ్లి అవుతుందన్న ఆనందం కంటే.. ఆ నోట్లను ఎలా మార్చుకోవాలిరా బాబూ.. అంటూ తల పట్టుకున్నాడు. వరుడికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు. ‘‘వివాహానంతరం ఈ వరుడు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే’’.. అని కొందరు, ‘‘అయ్యో! అతిథులంతా కలిసి వరుడికి పెద్ద పరీక్షే పెట్టారే’’.. అని ఇంకొందరు, ‘‘నోట్ల రద్దు నిర్ణయం ఎంత పని చేసింది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

Updated Date - 2023-05-24T15:47:51+05:30 IST