Real Life ‘3 Idiots’: కార్లో వెళ్తున్న ఓ వ్యక్తి.. పక్కనే స్కూటర్‌పై జరుగుతున్న సీన్‌ను సీక్రెట్‌గా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-05-25T20:04:36+05:30 IST

కొన్ని నిజ జీవిత సంఘటనలు.. అచ్చం సినిమా సీన్లను తలపిస్తూ ఉంటాయి. కొందరు సినిమాలు చూసి నిజ జీవితంలోనూ అలాగే చేయాలని చూస్తుంటారు. మరికొందరు చేసే విచిత్రమైన పనులు.. సినిమా సీన్లను తలపిస్తుంటాయి. ఇంకొందరు విధిలేని పరిస్థితుల్లో వినూత్న నిర్ణయాలు తీసుకున్నా.. అవి చూసేందుకు..

Real Life ‘3 Idiots’: కార్లో వెళ్తున్న ఓ వ్యక్తి.. పక్కనే స్కూటర్‌పై జరుగుతున్న సీన్‌ను సీక్రెట్‌గా వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తే..!

కొన్ని నిజ జీవిత సంఘటనలు.. అచ్చం సినిమా సీన్లను తలపిస్తూ ఉంటాయి. కొందరు సినిమాలు చూసి నిజ జీవితంలోనూ అలాగే చేయాలని చూస్తుంటారు. మరికొందరు చేసే విచిత్రమైన పనులు.. సినిమా సీన్లను తలపిస్తుంటాయి. ఇంకొందరు విధిలేని పరిస్థితుల్లో వినూత్న నిర్ణయాలు తీసుకున్నా.. అవి చూసేందుకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ప్రస్తుతం యువతీయువకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రమైన పనులు చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కార్లో వెళ్తున్న ఓ వ్యక్తి.. పక్కనే స్కూటర్‌పై జరుగుతున్న సీన్‌ను సీక్రెట్‌గా వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై ప్రయాణం చేస్తున్న తీరు చూసి వాహనదారులంతా.. బాలీవుడ్ 3ఇడియట్స్ చిత్రాన్ని (Bollywood 3 Idiots Movie) గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ముగ్గురు హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ (Aamir Khan) .. అనారోగ్యంగా వృద్ధుడైన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అయితే ఎంతకీ అంబులెన్స్ రాకపోవడంతో చివరకు అతడికి ఓ ఐడియా వస్తుంది. వృద్ధుడిని స్కూటీ మధ్యలో కూర్చోబెట్టుకుని, నేరుగా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు (Emergency ward) తీసుకెళ్తాడు.

Viral Video: లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొనలేక.. ఎండలను భరించలేక.. ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. సైకిల్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

3ఇడియట్స్ సినిమాను చూసి స్ఫూర్తి పొందాడో ఏమో తెలీదు గానీ.. ఇద్దరు వ్యక్తులు అచ్చం ఇలాగే చేశారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని స్కూటీ మధ్యలో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనను చూసి వాహనదారులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఎంత దీన పరిస్థితి’’.. అని కొందరు, ‘‘సరైన సమయానికి అంబులెన్స్ రాక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు’’.. అని మరికొందరు, ‘‘ఈ పెద్దాయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-05-25T20:04:36+05:30 IST