Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-05-25T18:23:11+05:30 IST

ఉద్యోగాలు చేయడం ఇష్టం లేని కొందరు.. సొంతకాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తాము ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవుతుంటే.. మరికొందరు సరైన అవగాహన లేక తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే ఇంకొందరు చిన్న చిన్న టెక్నిక్‌లతో చిన్న చిన్న వ్యాపారాలను..

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

ఉద్యోగాలు చేయడం ఇష్టం లేని కొందరు.. సొంతకాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తాము ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవుతుంటే.. మరికొందరు సరైన అవగాహన లేక తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే ఇంకొందరు చిన్న చిన్న టెక్నిక్‌లతో చిన్న చిన్న వ్యాపారాలను సైతం విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ఇలాంటి తెలివైన వ్యాపారుల గురించి ఇట్టే తెలిసిపోతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మామిడి పండ్లను అమ్మే క్రమంలో ఓ పిల్లాడి వెరైటీ టెక్నిక్ చూస్తే.. భవిష్యత్తులో ఈ బుడ్డోడు బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. అని మీరే అంటారు. ఇంతకీ ఇతను మామిడి పండ్లను ఎలా విక్రయిస్తున్నాడంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్‌గా మారింది. మామిడి పంట్ల సీజన్‌లో మైసూరు-మడికేరి జాతీయ రహదారిలో (Mysore-Madikeri National Highway) రోడ్డు పక్కన చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై పండ్లను విక్రయిస్తుంటారు. రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వ్యాపారులు పండ్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో వాహనదారులను ఆకర్షించేందుకు వ్యాపారులు వివిధ రకాల ప్రయాత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మామిడి పండ్లను విక్రయించడం కోసం (Sale of mangoes) ఓ బుడ్డోడు వాడిన టెక్నిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. రోడ్డు పక్కన వాహనదారులు ఆగేలా వివిధ రకాల స్టెప్పులు వేస్తున్నాడు.

Viral Video: లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొనలేక.. ఎండలను భరించలేక.. ఓ వ్యక్తి వెరైటీ ప్లాన్.. సైకిల్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

వాహనాలు సమీపానికి రాగానే.. డాన్స్ (Boy Dance) వేస్తూ, ‘‘రండి సార్.. మా మామిడి పండ్లు తీసుకోండి.. చాలా రుచిగా ఉన్నాయ్’’.. అంటూ వాహనదారులను ఆకర్షిస్తున్నాడు. ఇతడి తెలివితేటలు చూసి చాలా మంది వాహనదారులు ఆగి మరీ.. మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. అక్కడే ఉన్న ఓ వాహనదారులు (Motorists) ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అని కొందరు, ‘‘భవిష్యత్తులో వీడు ఖచ్చితంగా పైకి వస్తాడు’’.. అని మరికొందరు, ‘‘రోడ్డుపై ఇలా చేయడం ప్రమాదకరం.. జాగ్రత్త’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral News: వయసును తగ్గించేందుకు ఏటా రూ.16 కోట్ల ఖర్చు.. కన్నకొడుకు రక్తంతోనే ప్రయోగం స్టార్ట్.. అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే..!

Updated Date - 2023-05-25T18:23:11+05:30 IST