Bride: ఈ వధువు అత్తారింటికి చేరడానికి 6 నెలలు పట్టింది.. వినడానికి వింతగా ఉంది కదూ.. అసలు మరో విచిత్రం ఏమిటంటే..!

ABN , First Publish Date - 2023-05-26T17:02:20+05:30 IST

భాష ఏదైనా, ప్రాంతాలు వేరైనా.. వివాహ బంధంతో ఒక్కటవుతారు దంపతులు. అప్పటిదాకా తల్లిదండ్రుల వద్ద పెరిగిన వధువు.. పెళ్లి అనంతరం పుట్టింటిని వదిలిపెట్టి భర్తతో పాటూ మెట్టినింటికి పయనమవుతుంది. ఈ తంతు వివాహమైన తర్వాత సర్వసాధారణంగా జరిగేదే అయినా.. కొన్నిసార్లు..

Bride: ఈ వధువు అత్తారింటికి చేరడానికి 6 నెలలు పట్టింది.. వినడానికి వింతగా ఉంది కదూ.. అసలు మరో విచిత్రం ఏమిటంటే..!

భాష ఏదైనా, ప్రాంతాలు వేరైనా.. వివాహ బంధంతో ఒక్కటవుతారు దంపతులు. అప్పటిదాకా తల్లిదండ్రుల వద్ద పెరిగిన వధువు.. పెళ్లి అనంతరం పుట్టింటిని వదిలిపెట్టి భర్తతో పాటూ మెట్టినింటికి పయనమవుతుంది. ఈ తంతు వివాహమైన తర్వాత సర్వసాధారణంగా జరిగేదే అయినా.. కొన్నిసార్లు ఎవరూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వినూత్న వివాహానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వధువు వివాహమైన ఆరు నెలల తర్వాత అత్తారింటికి వచ్చింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ (Rajasthan) జోధ్‌పూర్‌కు చెందిన ముజిమ్మల్ ఖాన్ అనే యువకుడి తాత భల్హేఖాన్ మెహర్.. కొన్ని నెలల కిందట ఏదో పని మీద పాకిస్థాన్ (Pakistan) వెళ్లాడు. ఆ సమయంలో అక్కడి మిర్‌పుర్‌ఖాస్ ప్రాంతానికి చెందిన ఉరుజ్ ఫాతిమా అనే యువతిని (young woman) చూశాడు. ఆ యువతిని తన మనువడికి ఇచ్చి వివాహం (marriage) జరిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించాడు. అయితే రెండు కుటుంబాల వారు కలవాలంటే.. థార్ ఎక్స్‌ప్రెస్ (Thar Express) రైలు ఒక్కటే మార్గం. అయితే ఆ రైలును మూసేయడంతో వీరి పెళ్లికి చిక్కులు వచ్చి పడ్డాయి. ఇక విమానాల్లో ప్రయాణించే స్తోమత వారికి లేకపోవడంతో చివరికి ఆన్‌లైన్ మ్యారేజ్ (Online Marriage) ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఇలా జనవరి 2న ముజిమ్మల్ ఖాన్, ఉరుజ్ ఫాతిమా ఆన్‌లైన్ వివాహం జరిగింది.

Viral Video: మట్టి కుండలతో.. చిన్న ట్రిక్‌తో కూలర్ నుంచే ఏసీని మించిన కూలింగ్.. అసలు ఎలా సాధ్యమో మీరే చూడండి..!

ఎట్టకేలకు 6నెలల అనంతరం యువతి ఫాతిమా కుటంబ సభ్యులు బుధవారం వాఘా సరిహద్దుకు (Wagah border) చేరుకున్నారు. వధువును తీసుకెళ్లేందుకు వరుడు ముజిమ్మల్ ఖాన్.. తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అయితే వివాహానంతరం యువతి ఇండియా వచ్చేందుకు వీసా పొందాలంటే కొన్ని నెలల సమయం పడుతుందని, అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ‌షెకావత్ (Union Minister Gajendra Singh Shekawat) చొరవతో ఆరు నెలల్లోనే వీసా వచ్చిందని వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Viral Video: ఈ పిల్లాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం గ్యారెంటీ.. మామిడిపండ్ల వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-05-26T17:02:20+05:30 IST