Crime News: కుక్కకు ట్రైనింగ్ ఇవ్వమని యువకుడిని ఇంటికి పిలిచిన యువతి.. వంట గదిలో ఉండగా అతడు చేసిన నిర్వాకం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-05-28T18:32:57+05:30 IST

ఒంటరిగా ఉండే మహిళలకు ఎటువైపు, ఎవరి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా నమ్మకంగా ఉన్న వారు కాస్తా.. ఒక్కసారిగా కామాంధులుగా మారి దారుణాలకు తెగబడుతుంటారు. ఈ క్రమంలో తమ మాట వినని మహిళలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి..

Crime News: కుక్కకు ట్రైనింగ్ ఇవ్వమని యువకుడిని ఇంటికి పిలిచిన యువతి.. వంట గదిలో ఉండగా అతడు చేసిన నిర్వాకం ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

ఒంటరిగా ఉండే మహిళలకు ఎటువైపు, ఎవరి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా నమ్మకంగా ఉన్న వారు కాస్తా.. ఒక్కసారిగా కామాంధులుగా మారి దారుణాలకు తెగబడుతుంటారు. ఈ క్రమంలో తమ మాట వినని మహిళలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి దారుణాలు రోజూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ముంబైలో ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుక్కకు ట్రైనింగ్ ఇవ్వమని ఓ యువకుడిని ఇంటికి పిలిచింది. ఓ రోజు ఆమె వంట గదిలో ఉండగా.. అతడు చేసిన నిర్వాకం ఏంటంటే..

ముంబైలోని (Mumbai) దిఘా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి (young woman) ఇటీవల ఓ రోజు చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు ఓ పెంపుడు కుక్క (pet dog) ఉంది. దాన్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేది. అయితే కుక్కకు ట్రైనింగ్ (Dog training) ఇప్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు తెలిసిన వారి సలహాతో ఓ యువకుడిని సంప్రదించింది. రోజూ ఇంటికి వచ్చి తన కుక్కకు ట్రైనింగ్ ఇచ్చేలా అతడితో ఒప్పందం చేసుకుంది. ఇలా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తూ వచ్చిన అతను.. ఇటీవల యువతిపై కన్నేశాడు.

Viral News: రాత్రి అన్నం తిన్న వెంటనే 26 ఏళ్ల యువతి మృతి.. తల్లిదండ్రులు చూస్తుండగానే ఘోరం.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు ఏం తేల్చారంటే..!

ఎలాగైనా ఆమెను తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు కుక్కకు ట్రైనింగ్ ఇస్తూ ఉండగా.. యువతి ఒక్కటే వంట గదిలో ఉంది. ఎవరూ లేకపోవడం చూసి ఆమె వద్దకు వెళ్లి తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగాడు. నీళ్లు తీసుకుని దగ్గరికి వచ్చిన ఆమెను చేయి పట్టుకుని లాగి, అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ తన పైశాసికత్వాన్ని బయటపెట్టాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఊహించని ఈ ఘటనతో షాక్ అయిన యువతి.. ఎలాగోలా అతడి నుంచి విడిపించుకుని బయటకు వెళ్లింది. పోలీసులను కలిసి తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: అమెరికా యువకుడిని ఖంగుతినిపించిన సమోసా.. దెబ్బకి ఇండియా గుర్తొచ్చి.. ఏమన్నాడో చూడండి..

Updated Date - 2023-05-28T18:32:57+05:30 IST