Live Frog In Packed Food: పార్శిల్‌లో సగం ఆహారాన్ని తిన్న తర్వాత.. ప్లాస్టిక్ కప్పులో ఎగురుతూ కనిపించిన కప్ప..!

ABN , First Publish Date - 2023-05-31T16:12:32+05:30 IST

పెద్ద పెద్ద హోటళ్లలో కొత్త కొత్త ఫుడ్ ఐటెమ్స్‌ని టేస్ట్ చేయాలని భోజన ప్రియులు ఉవ్విల్లూరుతుంటారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోటల్ నిర్వాహకులు కూడా అనేక రకాల ఆహార పదార్థాలను వండి వారుస్తుంటారు. మరికొందరు కొత్త కొత్త రెసిపీలను మిక్స్ చేసి సరికొత్త వంటకాలను పరిచయం చేస్తుంటారు. అయితే..

Live Frog In Packed Food: పార్శిల్‌లో సగం ఆహారాన్ని తిన్న తర్వాత.. ప్లాస్టిక్ కప్పులో ఎగురుతూ కనిపించిన కప్ప..!

పెద్ద పెద్ద హోటళ్లలో కొత్త కొత్త ఫుడ్ ఐటెమ్స్‌ని టేస్ట్ చేయాలని భోజన ప్రియులు ఉవ్విల్లూరుతుంటారు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోటల్ నిర్వాహకులు కూడా అనేక రకాల ఆహార పదార్థాలను వండి వారుస్తుంటారు. మరికొందరు కొత్త కొత్త రెసిపీలను మిక్స్ చేసి సరికొత్త వంటకాలను పరిచయం చేస్తుంటారు. అయితే ఆహార నాణ్యత విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా జపాన్‌కి చెందిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. పార్శిల్‌లో సగం ఆహారం తిన్న తర్వాత.. కప్పు అడుగను నుంచి ఓ కప్ప ఎగురుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral video) అవుతోంది. జపాన్‌కు (Japan) చెందిన ఓ వ్యక్తి.. ఇటీవల ఓ ప్రముఖ హోటల్‌(Hotel) నుంచి నూడుల్స్ (Noodles) ఫుడ్‌ను ఆర్డర్ చేశాడు. పార్శిల్ రాగానే ఎంతో ఇష్టంతో ఓపెన్ చేశాడు. కూరగాయలు, మసాలాలతో కూడిన ఈ వెరైటీ నూడిల్స్‌ను అంతే ఇష్టంతో తినడం మొదలుపెట్టాడు. అయితే సగం తినగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న బతికున్న ఓ కప్ప (Live Frog) .. నూడిల్స్ మధ్యలో నుంచి ఎగురుకుంటూ పైకి వచ్చింది.

Viral News: కనిపించని కూతురు కోసం తండ్రి వెతుకులాట.. చివరకు పెంపుడు కుక్క వెనుకే వెళ్లగా.. నిర్మానుష్య ప్రదేశంలో షాకింగ్ సీన్..

దీంతో అప్పటిదాకా.. లొట్టలేసుకుని మరీ తింటున్న వ్యక్తి.. ఒక్కసారిగా వాంతి చేసుకున్నంత పనైంది. వెంటనే ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫుడ్‌లో స్పెషల్ ఐటెం.. సూపర్’’.. అంటూ కొందరు, ‘‘ఇప్పుడు ఇతడి పరిస్థితి ఏంటో’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral News: రాత్రి అన్నం తిన్న వెంటనే 26 ఏళ్ల యువతి మృతి.. తల్లిదండ్రులు చూస్తుండగానే ఘోరం.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు ఏం తేల్చారంటే..!

Updated Date - 2023-05-31T16:15:10+05:30 IST