Viral Video: ఇలాంటి రోడ్డును మీరు ఇంత వరకు చూసి ఉండరు.. చాపలా చుట్టేసి ఇంటికి కూడా తీసుకెళ్లిపోవచ్చు..!

ABN , First Publish Date - 2023-05-31T19:30:16+05:30 IST

కొందరు కాసుల కోసం కక్కుర్తి పడి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారు చేసే కక్కుర్తి పనులు.. కొన్ని కోపం తెప్పిస్తే, మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..

Viral Video: ఇలాంటి రోడ్డును మీరు ఇంత వరకు చూసి ఉండరు.. చాపలా చుట్టేసి ఇంటికి కూడా తీసుకెళ్లిపోవచ్చు..!

కొందరు కాసుల కోసం కక్కుర్తి పడి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారు చేసే కక్కుర్తి పనులు.. కొన్ని కోపం తెప్పిస్తే, మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ కాంట్రాక్టర్ జర్మన్ టెక్నాలజీ పేరుతో వేసి తారు రోడ్డును చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. చాపలా చుట్టేసి ఇంటికి తీసుకెళ్లేలా ఉన్న రోడ్డు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై నెటిజన్లు.. ‘‘ఇదెక్కడి తారు రోడ్డురా నాయానా.. ఇది మేం చూల్లే’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మహారాష్ట్ర (Maharashtra) అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సౌకర్యార్థం ప్రధాన మంత్రి రూరల్ రహదారి పథకం కింద తారు రోడ్డు మంజూరైంది. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ (contractor) .. జర్మన్ టెక్నాలజీతో (German technology) రోడ్డు వేయనున్నట్లు ప్రకటించి పనులను ప్రారంభించాడు. కొత్త టెక్నాలజీ కాబట్టి రోడ్డు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా రోడ్డు వేశాక.. కొందరు ఎలా ఉందో చూద్దామని వెళ్లారు. తీరా రోడ్డు వేసిన విధానం చూసి ఖంగుతిన్నారు. మట్టి రోడ్డుపై ఓ కార్పెట్ పరిచి, దానిపై తారు పోశారు. చూసేందుకు మాత్రం అచ్చం తారు రోడ్డు (road) లాగే కనిపిస్తోంది. కాంట్రాక్టర్ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి రోడ్డు వేశారంటూ స్థానికులు మండిపడ్డారు.

Chewing Gum: ఒకేసారి 40 బబుల్ గమ్‌లను తిన్న 5 ఏళ్ల కొడుకు.. తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆ బాలుడి పరిస్థితి ఏంటంటే..!

ఓ కార్పెట్‌పై అంగులం మేర మాత్రమే తారు ఉండడం చూసి అంతా అవాక్కయ్యారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్డు వద్ద నిరసన తెలియజేశారు. అసలే రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని.. ఇలాంటి కాంట్రాక్లర్ల వల్ల నిర్లక్ష్యం వల్ల మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రోడ్డు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral video) అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని కొందరు, ‘‘ఇదేం రోడ్డురా నాయానా.. ఇది మేం చూల్లే’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి కాంట్రాక్టర్లు ఉంటే.. ఇక అంతే సంగతి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంత చేసుకుంది.

Viral News: చేసేదే పాడు పని.. పైగా వీడియో తీసుకున్నారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ లాయర్.. అడ్డంగా దొరికిపోయారుగా..!

Updated Date - 2023-05-31T19:30:16+05:30 IST