Viral News: ఇలా ఉన్న యువతి ముఖం.. చివరకు ఇలా అయిపోయింది.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..!

ABN , First Publish Date - 2023-06-01T18:15:30+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సొంతింటి వైద్యం, కొత్త కొత్త వంట ప్రయోగాలు ఎక్కువైపోయాయి. ఎలాంటి అనుభవమూ లేకున్నా.. చాలా మంది వీడియోలు చూసి ప్రయోగాలు చేస్తుంటారు. వైద్యం విషయంలో కొందరు ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరు..

Viral News: ఇలా ఉన్న యువతి ముఖం.. చివరకు ఇలా అయిపోయింది.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సొంతింటి వైద్యం, కొత్త కొత్త వంట ప్రయోగాలు ఎక్కువైపోయాయి. ఎలాంటి అనుభవమూ లేకున్నా.. చాలా మంది వీడియోలు చూసి ప్రయోగాలు చేస్తుంటారు. వైద్యం విషయంలో కొందరు ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరు వంట రాకున్నా వీడియోలు చూసి తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువతి చేసిన పనికి బాగున్న మొఖం కాస్తా కాలిపోయింది. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

బ్రిటన్‌కి (Britain) చెందిన షఫియా బషీర్ అనే మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఈమె సోషల్ మీడియాలో ప్లాట్‌ఫాంలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో షిఫియా టిక్‌టాక్‌లో ఓ వీడియో చూసింది. ఉడికించిన గుడ్లతో (Cooking eggs) చేసే వంటను చూసి.. తానూ అలాగే చేయాలని ప్రయత్నించింది. ఇందుకోసం ఆమె ముందుగా గుడ్లను ఉడకబెట్టింది. ఈ క్రమంలో వాటిని చాలా సేపు మైక్రోవేవ్‌లో (Microwave) ఉంచింది. చివరగా వాటిని బయటికి తీసి, వేడి నీటిలో చల్లటి చెంచాను వేసింది. దీంతో ఒక్కసారిగా శబ్ధంతో పగిలిపోయి వేడి నీరు మొత్తం మొఖంపై పడింది.

Marriage: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే రెండ్రోజుల క్రితమే ఈ కుర్రాడి పెళ్లి జరిగి ఉండేది.. పెళ్లికి కొద్ది గంటల ముందు జరిగిన ఒక్క ఘటనతో..!

ఈ ప్రమాదంలో ఆమె మొఖం మొత్తం కాలిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కొన్ని వారాల పాటు చికిత్స తీసుకోవడంతో పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం తన మొఖం యథాస్థితికి వచ్చిందని చెప్పింది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి, వంట చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తనలాగా ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని, మరీ ముఖ్యంగా మైక్రోవేవ్‌ వినియోగించే ముందు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇదిలావుండగా, బ్రిటిష్ మెడికల్ జర్నల్ (British Medical Journal) కూడా ఇలాంటి విషయాల్లో గతంలో ప్రజలను పలుమార్లు హెచ్చరించింది. కాగా, గాయపడిన యువతికి సంబంధించిన వార్త.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-01T18:15:30+05:30 IST