Wife: ఆరుగురు పిల్లల తల్లి.. ఇలా చేస్తుందని భర్త కూడా ఊహించలేదు.. ఎండాకాలం కదా అని ఇంటి ముందు మంచం వేసుకుని పడుకుంటే..!

ABN , First Publish Date - 2023-06-01T20:39:37+05:30 IST

కొందరు తాత్కాలిక సంతోషాలకు అలవాటు పడి.. జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు తీరా తమ తప్పులు బయటపడ్డాక.. వాటిని కప్పి పుచ్చేందుకు మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఆరుగురు పిల్లలతో సంతోషంగా సాగుతున్న..

Wife: ఆరుగురు పిల్లల తల్లి.. ఇలా చేస్తుందని భర్త కూడా ఊహించలేదు.. ఎండాకాలం కదా అని ఇంటి ముందు మంచం వేసుకుని పడుకుంటే..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు తాత్కాలిక సంతోషాలకు అలవాటు పడి.. జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటుంటారు. మరికొందరు తీరా తమ తప్పులు బయటపడ్డాక.. వాటిని కప్పి పుచ్చేందుకు మరిన్ని తప్పులు చేస్తుంటారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఆరుగురు పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆ సంసారంలో సడన్‌గా ఊహించని సమస్య వచ్చి పడింది. పిల్లలు, భర్తతో సంతోషంగా ఉన్న భార్య.. చివరకు ఇలాం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎండాకాలం కదా అని.. భర్త తన ఇంటి ముందు మంచం వేసుకుని పడుకున్నాడు. చివరికి ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) గోపాల్‌గంజ్ జిల్లా లాధ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహ్మద్ మియాన్ అనే వ్యక్తికి నూర్జహాన్ ఖాతూన్, ఆరుగురు పిల్లలు ఉన్నారు. మహ్మద్ చేపల వ్యాపారం (Fish business) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్న నూర్జహాన్ జీవితంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. దీంతో అప్పటిదాకా సవ్యంగా సాగుతున్న వారి సంసారం సమస్యలకు నిలయంగా మారింది. సమీప ప్రాంతానికి చెందిన నౌషద్ అనే వ్యక్తిపై నూర్జహాన్ ప్రేమ (love) పెంచుకుంది. భర్తకు తెలీకుండా అతడితో తరచూ రాసలీలలు సాగిస్తూ ఉండేది.

Viral News: వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియుడి నోట వింత డిమాండ్.. పోలీసులు వచ్చి పక్క ఊళ్లో ఉన్న ప్రేయసిని వెతికి తీసుకొచ్చాక..!

వీరి వివాహేతర సంబంధం (extramarital affair) గురించి ఇటీవల భర్తకు తెలిసింది. దీంతో అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు (quarrels) తలెత్తాయి. ఎంత చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నూర్జహాన్‌ కోపం కట్టలు తెంచుకుంది. భార్యపై విచక్షణా రహితంగా దాడి (Assault on wife) చేయడం మొదలెట్టాడు. రోజు రోజుకూ చిత్రహింసలు పెరిగిపోవడంతో నూర్జహాన్ చివరకు.. పిల్లలను తీసుకుని ప్రియుడితో వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి ఇటీవల భార్యను మరింత చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో చివరకు ఆమె భర్తను చంపేయాలనుకుంది.

Viral News: ఇలా ఉన్న యువతి ముఖం.. చివరకు ఇలా అయిపోయింది.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..!

women-crime.jpg

ప్రియుడితో మాట్లాడి ఇద్దరూ కలిసి కిరాయి హంతకులకు రూ.50వేలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఎండాకాలం కావడంతో మే 22న రాత్రి మహ్మద్ ఇంటి బయట పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్న నిందితులు.. మహ్మద్‌పై కాల్పులు (firing) జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-01T20:39:37+05:30 IST