Wife: రెండేళ్ల క్రితమే పెళ్లి.. రోజూ షాపింగ్‌కే రూ.70 లక్షలు ఖర్చు చేస్తోందట.. ఈమె భర్త ఎవరో.. అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-06-02T18:48:58+05:30 IST

ప్రతి మనిషికీ ఏదో ఒక కోరిక ఉంటుంది. కోట్లు సంపాదించాలని, ఖరీదైన బంగ్లాలు, కార్లు కొనాలని, దేశ విదేశాలు తిరగాలని, ఇష్టపడ్డ వారినే పెళ్లి చేసుకోవాలని.. ఇలా అనేక కోరికలు ఉండడం సహజమే. అయితే వాటిని సాధించేందుకు కొందరు మాత్రమే కష్టపడుతుంటారు. మరికొందరు కేవలం..

Wife: రెండేళ్ల క్రితమే పెళ్లి.. రోజూ షాపింగ్‌కే రూ.70 లక్షలు ఖర్చు చేస్తోందట.. ఈమె భర్త ఎవరో.. అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..!

ప్రతి మనిషికీ ఏదో ఒక కోరిక ఉంటుంది. కోట్లు సంపాదించాలని, ఖరీదైన బంగ్లాలు, కార్లు కొనాలని, దేశ విదేశాలు తిరగాలని, ఇష్టపడ్డ వారినే పెళ్లి చేసుకోవాలని.. ఇలా అనేక కోరికలు ఉండడం సహజమే. అయితే వాటిని సాధించేందుకు కొందరు మాత్రమే కష్టపడుతుంటారు. మరికొందరు కేవలం కలలకే పరిమితమవుతూ జీవితంలో రాజీ పడి కాలం వెళ్లదీస్తుంటారు. ఇక బాగా డబ్బున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి వారి అభిరుచికి తగ్గట్టుగా రోజూ వేలు, లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ ఈ కోవకే చెందుతుంది. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ మహిళ.. రోజూ కేవలం షాపింగ్‌కే రూ.70లక్షలు ఖర్చు చేస్తోందట. ఈమె భర్త గురించి తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.

దుబాయ్‌కి (Dubai) చెందిన ఓ మహిళకు (woman) సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral photos) అవుతున్నాయి. దీంతో అంతా ఈమె గురించి తెగ ఆరా తీస్తున్నారు. ఈ మహిళకు రెండేళ్ల క్రితం జమాల్ అనే వ్యక్తితో వివాహమైంది. సౌదీ అరేబియాకు (Saudi Arabia) చెందిన జమాల్.. కొన్నేళ్ల కిందట దుబాయ్ వచ్చాడు. వీరిద్దరూ దుబాయ్‌లోని యూనివర్సిటీలో కలుసుకున్నారు. స్వతహాగా ధనవంతుడైన జమాల్.. యువతిని ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నిత్యం పర్యాటక ప్రదేశాలను (Tourist places) సందర్శించే అలవాటు ఉంది. ఇక వృత్తిపరంగా డిజైనర్ అయిన మహిళకు షాపింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వివిధ రకాల దుస్తులు, బ్యాగులు తదితరాను కొంటూ వాటిని సోషల్ మీడియలో షేర్ చేస్తూ ఉంటుంది.

Bride: వామ్మో.. ఈ పాము పెద్ద కథే నడిపిందిగా.. ఈ వధువు వద్దకు వరుడిని ఎలా రప్పించిందో మీరే చూడండి..!

ఈమెకు సోషల్ మీడియా వేదికల్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఈ దంపతులు నిత్యం పోస్టులు పెడుతు వారితో టచ్‌లో ఉంటారు. సదరు మహిళ కేవలం షాపింగ్ (Shopping) కోసమే రోజూ సుమారు రూ.70లక్షల వరకూ ఖర్చు చేస్తుందట. ఇటీవలే ఈ జంట మాల్దీవులను (Maldives) సందర్శించి, అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరికి మ్యాచింగ్ కార్లు అంటే ఎంతో ఇష్టమట. జమాల్ తన భార్యకు ఇటీవలే ఖరీదైన బ్యాగులు, రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడట. వివిధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ఈ జంట.. లక్షల్లో ఖర్చు చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా విలాసంతమైన హోటళ్లలో బస చేయడం, ఖరీదైన దస్తులు, బహుమతులతో ఒకరినొకరు సర్‌ఫ్రైజ్ చేసేందుకు ఇష్టపడతారట. ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-02T18:48:58+05:30 IST