Snake Video: పామును ఇలా చేతిలో పట్టుకుని నడి వీధిలో వేషాలు వేశాడు.. ఒకే ఒక్క మిస్టేక్‌తో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-06-03T16:52:43+05:30 IST

పాములను పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత ప్రమాదకరమైన పాములను అయినా చాలా చాకచక్యంగా పట్టేస్తుంటారు. అయితే అంతటి అనుభవం ఉన్న వారు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. తద్వారా..

Snake Video: పామును ఇలా చేతిలో పట్టుకుని నడి వీధిలో వేషాలు వేశాడు.. ఒకే ఒక్క మిస్టేక్‌తో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

పాములను పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత ప్రమాదకరమైన పాములను అయినా చాలా చాకచక్యంగా పట్టేస్తుంటారు. అయితే అంతటి అనుభవం ఉన్న వారు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. తద్వారా పాము కాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు పామును చేతిలో పట్టుకుని నడి వీధిలో వేషాలు వేశాడు. కే ఒక్క మిస్టేక్‌తో చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్ (Uttar Pradesh Kushinagar) పరిధి తమ్‌కుహిరాజ్ తహసీల్ లోని లత్వచట్టి మార్కెట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోకి విష సర్పం చొరబడడంతో స్థానికులు భయంతో స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) ఫోన్ చేశారు. కాసేపటికి అక్కడికి వచ్చిన యువకుడు పామును (snake) పట్టుకున్నాడు. అయితే అంతంతమాత్రమే అవగాహన ఉండడంతో పామును పట్టుకోవడంలో సదరు యువకుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. పామును పట్టుకుని నడి వీధిలో నిలబడి హీరోయిజం చూపించాడు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిచండంతో పాము అతడి చేతిపై (snake bit a young man) కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా చేతికి కట్టు కట్టుకుని, పామును పట్టుకుని అక్కడున్న వారికి అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు.

Cooler made with Drum: వారెవ్వా.. తెలివంటే నీదే బాసూ.. నీళ్ల కోసం వాడే డ్రమ్ముతో ఏకంగా కూలర్‌నే తయారు చేశాడు..!

పాము గురించి వివరిస్తూ.. ఎక్కడైనా పాము కనిపిస్తే తనకు కాల్ చేయాలని.. ఇలా ఏవేవో చెబుతూ కాలయాపన చేశాడు. మధ్యలో కాటు వేసిన ప్రాంతంలో విషాన్ని నోటితో పీల్చి ఉమ్మి వేశాడు. అయితే అప్పటికే చాలా సమయం కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై నిపుణులు మాట్లాడుతూ అనుభవం ఉన్న వారు మాత్రమే పాములను పట్టుకోవాలన్నారు. విష సర్పాలను పట్టుకునే క్రమంలో గ్లౌజులు, ప్రత్యేకంగా తయారు చేసిన ఐరన్ స్టిక్ తదితరాలను వినియోగించాలని సూచించారు. కాగా, యువకుడి మృతితో ఖషీనగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: కొంపదీసి ఆమె భర్త విడాకులు ఇస్తాడా ఏంటి..?.. పెళ్లి వేడుకలో ఈ మహిళ డాన్స్ చూసి నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Updated Date - 2023-06-03T16:52:43+05:30 IST