ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఏంటీ.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో చాటింగ్ చేస్తున్నాడా..? ఒక్క క్షణం అవాక్కైన వ్యక్తి.. చివరగా వచ్చిన మెసేజ్‌ను చూసి షాక్..!

ABN, First Publish Date - 2023-03-30T18:34:27+05:30

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మూరు మూల గ్రామంలో ఉంటూనే మహా నగరాల్లోని వ్యక్తులతో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. అంతేకాకుండా విదేశాల్లో ఉంటున్న వారు కూడా స్నేహితులుగా మారిపోతుంటారు. ఇలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మూరు మూల గ్రామంలో ఉంటూనే మహా నగరాల్లోని వ్యక్తులతో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. అంతేకాకుండా విదేశాల్లో ఉంటున్న వారు కూడా స్నేహితులుగా మారిపోతుంటారు. ఇలా ఏర్పడే పరిచయాల వల్ల ప్రయోజనం ఎంతుంటుందో.. కొన్నిసార్లు నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా రోజూ మన చుట్టూ ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా, సిమ్లాకు (Shimla) చెందిన ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముఖ్యమంత్రి నుంచి మెసేజ్ రావడంతో.. ‘‘ఏంటీ.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నాతో చాటింగ్ చేస్తున్నాడా’’.. అని సదరు యువకుడు అవాక్కయ్యాడు. అయితే చివరగా వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) సిమ్లాకు చెందిన యువకుడికి ఇటీవల ఓ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhvinder Singh Sukhu) ఫేస్‌బుక్ నుంచి హాయ్!.. అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన యువకుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. హాయ్.. అంటూ మొదలైన సీఎం చాటింగ్.. ‘‘ఎలా వున్నారు, ఎక్కడ ఉన్నారు’’.. అంటూ సాగింది. దీంతో యువకుడు కూడా ఆనందంతో వెంటవెంటనే రిప్లై ఇస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో తర్వాత వచ్చిన సీఎం నుంచి మెసేజ్ చూసి ఖంగుతిన్నాడు. ‘‘మా స్నేహితుడు నాకు రూ.20,000 పంపుతున్నాడు.. కానీ నా బ్యాంక్ అకౌంట్ (Bank account) పని చేయలేదు.. అందుకని మీ గూగుల్ పే లేదా ఫోన్ పే నంబర్ పంపితే.. మీ అకౌంట్‌కు ఆ మొత్తాన్ని పంపమని చెప్తా’’.. అని అన్నాడు.

హైవేపై పోలీసుల తనిఖీలు.. పిల్ల తల్లిని సర్.. పాప ఏడుస్తోంది.. త్వరగా వెళ్లనీయండంటూ పదే పదే అడుగుతున్న యువతి.. అనుమానంతో బైక్‌లో చెక్ చేస్తే..

ఈ మెసేజ్ చూడగానే ‘‘ఏంటీ... సీఎం ఏంటీ.. మరీ ఇలా రూ.20,000 పంపుతున్నా చెప్పడం ఏంటీ’’.. అని అనుకుంటూ సదర్ సీఎం ఫేస్‌బుక్ ఖాతాను (Facebook account) మొత్తం పరిశీలించాడు. చివరకు అది ఫేక్ ఐడీ అని తెలుసుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్ సీఎం పేరు కూడా తెలీని వ్యక్తి.. ఇలా సుఖ్విందర్ సింగ్ సుఖు పేరుతో ఫేక్ అకౌంట్ (Fake account) క్రియేట్ చేసినట్లు గుర్తించి నవ్వుకున్నాడు. చివరగా ఆ చాటింగ్ సారాంశాన్ని మొత్తం స్క్రీన్ షాట్ తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్‌గా (Viral post) మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Wife: ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ.. పోలీసులకు తేల్చిచెప్పిన ఈ మహిళ కథేంటంటే..

Updated Date - 2023-03-30T18:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising