హైవేపై పోలీసుల తనిఖీలు.. పిల్ల తల్లిని సర్.. పాప ఏడుస్తోంది.. త్వరగా వెళ్లనీయండంటూ పదే పదే అడుగుతున్న యువతి.. అనుమానంతో బైక్‌లో చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2023-03-30T16:55:26+05:30 IST

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్థులు చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు. పైకి అమాయకుల్లా నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న క్లూలతో దొరికిపోతుంటారు. ఇటీవల ..

హైవేపై పోలీసుల తనిఖీలు.. పిల్ల తల్లిని సర్.. పాప ఏడుస్తోంది.. త్వరగా వెళ్లనీయండంటూ పదే పదే అడుగుతున్న యువతి.. అనుమానంతో బైక్‌లో చెక్ చేస్తే..
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్థులు చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు. పైకి అమాయకుల్లా నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న క్లూలతో దొరికిపోతుంటారు. ఇటీవల హిమాచ్ ప్రదేశ్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. హైవేపే పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో భార్యాభర్తలు బైకుపై అక్కడికి వచ్చారు. ‘‘పిల్ల తల్లిని సర్.. పాప ఏడుస్తోంది.. త్వరగా వెళ్లనీయండి’’.. అని యువతి పదే పదే అడగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. చివరికి బైకులో పరిశీలించి షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉనా జిల్లా సంతోష్‌గఢ్ పరిధి ఇంద్రా ప్యాలెస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (Anti Narcotics Task Force) అడిషనల్ ఎస్పీ కులభూషణ్ వర్మ ఆధ్వర్యంలో స్థానికంగా వాహనాల తనిఖీ (vehicle checking) చేపట్టారు. ఆ సమయంలో ఓ యువకుడు, తన భార్యతో కలిసి బైకుపై అక్కడికి వచ్చాడు. అతడిని ఆపిన పోలీసులు విచారిస్తున్నారు. మహిళ చేతిలో ఓ పాప కూడా ఉంది. పోలీసులు ఆలస్యం చేస్తుండడంతో.. ‘‘సర్.. మా పాప ఏడుస్తోంది.. త్వరగా వెళ్లనీయండి సర్’’.. అని మహిళ (woman) పదే పదే పోలీసులను కోరింది. దీంతో వారికి సదరు దంపతులపై అనుమానం కలిగింది.

Girl Friend: ప్రియుడి పేరేంటో కూడా తెలియకుండా 4 నెలలుగా డేటింగ్.. అతడిని అడగకుండానే పేరును ఆమె ఎలా తెలుసుకుందంటే..!

man-and-women-crime.jpg

ఈ క్రమంలో బైక్ స్పీడో మీటర్ వద్ద ఉన్న కవర్‌ను పరిశీలించారు. అందులో 63.58 గ్రాముల హెరాయిన్ (Heroin) ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. చివరకు వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. విచారణలో సదరు నిందితుడు పంజాబ్ రోపర్ జిల్లా నంగల్ ప్రాంత పరిధి గోల్నీకి చెందిన రామ్ అస్రా అని తెలిసింది. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. అతడితో పాటూ బైకుపై వచ్చిన యువతి, వేరే కుటుంబానికి చెందిన పాపను తీసుకొచ్చినట్లు తెలిసింది. పాపను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Wife: ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ.. పోలీసులకు తేల్చిచెప్పిన ఈ మహిళ కథేంటంటే..

Updated Date - 2023-03-30T16:55:26+05:30 IST