Girl Friend: ప్రియుడి పేరేంటో కూడా తెలియకుండా 4 నెలలుగా డేటింగ్.. అతడిని అడగకుండానే పేరును ఆమె ఎలా తెలుసుకుందంటే..!

ABN , First Publish Date - 2023-03-29T21:03:31+05:30 IST

ప్రేమ గుడ్డిది అంటారు.. ఎందుకంటే ప్రేమకు కులం, మతం, ప్రాంతం.. ఇలా ఏవీ ఉండవు. చాలా మంది యువతీయవకులు కేవలం మనిషి, మనసును చూసే ప్రేమించేస్తుంటారు. చివరకు పెళ్లి ప్రస్తావన వచ్చే వరకు వీరికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడీ..

Girl Friend: ప్రియుడి పేరేంటో కూడా తెలియకుండా 4 నెలలుగా డేటింగ్.. అతడిని అడగకుండానే పేరును ఆమె ఎలా తెలుసుకుందంటే..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ గుడ్డిది అంటారు.. ఎందుకంటే ప్రేమకు కులం, మతం, ప్రాంతం.. ఇలా ఏవీ ఉండవు. చాలా మంది యువతీయవకులు కేవలం మనిషి, మనసును చూసే ప్రేమించేస్తుంటారు. చివరకు పెళ్లి ప్రస్తావన వచ్చే వరకు వీరికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ తన ప్రియుడి గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చివరకు వైరల్‌గా మారింది. ప్రియుడి పేరేంటో కూడా తెలియకుండా 4 నెలలుగా డేటింగ్ చేశానని చెప్పింది. అయితే అతన్ని అడక్కుండానే పేరును ఎలా తెలుకుందంటే..

సోషల్ మీడియాలో ఓ మహిళ తన ప్రియుడి గురించి ఆసక్తికర పోస్టు (Woman viral posts) పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ (Facebook, Instagram, Twitter) వంటివి లేని సమయంలో ఓ యువతి (young woman) ప్రేమలో పడింది. అయితే తన ప్రియుడి పేరు పాట్రిక్ లేదా రిచర్డ్ అని అనుకుంది. కానీ ఆమెకు ఖచ్చితంగా తెలీదు. అయినా పేరుతో పనేముందీ.. మనిషి ముఖ్యం అనుకుని ఎప్పుడూ ఆమె పట్టించుకోలేదు. ఇలా నాలుగు నెలల పాటు అతడితో డేటింగ్ చేసింది. ఈ క్రమంలో వారు నిశ్చితార్థం చేసుకోవాలని అనుకున్నారు. అప్పుడు ఆమెకు తన ప్రియుడి (boyfriend) పేరు ఏంటబ్బా.. అనే సందేహం వచ్చింది. అయితే తనను అడగకుండానే తెలుసుకోవాలని అనుకుంది.

Viral News: నేనసలే చిరాగ్గా ఉన్నా.. నాకు అస్సలు కాల్ చేయకండంటూ నేరుగా బాస్‌కు మెసేజ్ చేసిన మహిళ..!

అప్పట్లో సోషల్ మీడియా (Social media) ప్రభావం పెద్దగా లేకపోవడంతో తెలుసుకునే వీలు లేకపోయింది. అయినా ప్రియుడి పేరును తెలుసుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించింది. చివరకు తన ప్రియుడికి సంబంధించిన కారు, బీమాకు సంబంధించిన పత్రాలను చూసి తెలుసుకుంది. అనంతరం వారు నిశ్చితార్థం (Engagement) చేసుకున్నారు. కాగా, ఈమె పోస్టు వైరల్ అవడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కొందరు పేర్లు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.. మరికొందరు అసలు పట్టించుకోరు’’.. అని కొందరు, ‘‘మా పేరు ఒకటైతే.. మా భర్తలు వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు’’.. అని ఇంకొందరు మహిళలు, ‘‘మా ఆఫీసుల్లో సహోద్యోగులు మమ్మల్ని ఇష్టమొచ్చిన పేర్లతో పిలుస్తుంటారు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!

Updated Date - 2023-03-29T21:03:31+05:30 IST