Viral News: నేనసలే చిరాగ్గా ఉన్నా.. నాకు అస్సలు కాల్ చేయకండంటూ నేరుగా బాస్‌కు మెసేజ్ చేసిన మహిళ..!

ABN , First Publish Date - 2023-03-29T19:51:54+05:30 IST

ఆఫీసు పని వేళల్లో ఉద్యోగులకు అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. పని ఒత్తిడి కారణంగా కొందరు ఇబ్బంది పడితే.. బాస్‌ల టార్చర్ భరించలేక మరికొందరు సతమతమవుతుంటారు. ఇక మహిళలకు ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు మహిళలు..

Viral News: నేనసలే చిరాగ్గా ఉన్నా.. నాకు అస్సలు కాల్ చేయకండంటూ నేరుగా బాస్‌కు మెసేజ్ చేసిన మహిళ..!

ఆఫీసు పని వేళల్లో ఉద్యోగులకు అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. పని ఒత్తిడి కారణంగా కొందరు ఇబ్బంది పడితే.. బాస్‌ల టార్చర్ భరించలేక మరికొందరు సతమతమవుతుంటారు. ఇక మహిళలకు ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు మహిళలు సహోద్యోగుల నుంచి, బాస్‌ల నుంచి అనేక రకాల వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు విధిలేని పరిస్థితుల్లో సర్దుకుని వెళ్తుంటారు. మరికొందరు మహిళలు తెగించి మరీ ఎదురుదాడికి దిగుతుంటారు. ప్రస్తుతం ఓ మహిళ తన బాస్‌కు పెట్టిన మెసేజ్.. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘నేనసలే చిరాగ్గా ఉన్నా.. నాకు అస్సలు కాల్ చేయకండి’’.. అని తన బాస్‌కు మెసేజ్ పెట్టింది. దీనికి అతను ఇచ్చిన రిప్లై ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన పోస్టు వైరల్‌గా (Viral post) మారింది. సెలవులో ఉన్న మహిళకు తన బాస్ నుంచి ఫోన్ మీద ఫోన్లు వచ్చాయి. ఇలా రెండు సార్లు కాల్ రాగానే.. ఆమెకు విపరీతమైన కోపం (angry woman) వచ్చింది. ‘‘నేనసలే చిరాగ్గా ఉన్నా.. నాకు అస్సలు కాల్ చేయకండి’’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేసింది. ఈ మెసేజ్ (message) చూడగానే ఏ బాస్ అయినా మరింత ఆగ్రహానికి గురవుతాడు. కొందరైతే ఉద్యోగం (job) నుంచి తీసేందుకూ వెనుకాడరు. అయితే ఈమె బాస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు.

Wife- Husband: భార్యతో కలిసి పార్టీ చేసుకుంటుంటే ఇలా జరిగిందేంటి..? బాత్ టబ్‌లో ఇద్దరూ కూర్చుని ఉండగా..

మహిళ మెసేజ్ చూసిన బాస్.. ‘‘ఆరోగ్యం బాగోలేక పోతే మీ పనిని నాకు అప్పగించండి. అవసరమైతే 3-4 రోజులు సెలవు తీసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.. అప్పుడే సంతోషంగా పని చేయగలరు’’.. అని రిప్లై ఇచ్చాడు. తన బాస్ స్పందనను తెలియజేస్తూ... స్తుతి అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో (Twitter account) ఓ పోస్టు షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆహా! మా ఆఫీసులో కూడా ఇలాంటి వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది’’.. అని కొందరు, అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి... అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!

Updated Date - 2023-03-29T19:51:54+05:30 IST