Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం పని..? బాత్రూంలోకి పామును తీసుకెళ్లి మరీ ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-03-28T19:52:22+05:30 IST

పామును చూస్తే.. స్నేక్ క్యాచర్లకు మినహా ఎవరికైనా చచ్చేంత భయం వేస్తుంది. పొరపాటున అవి దగ్గరగా వస్తే ఇక దాదాపు ప్రాణం పోయేంత పని అవుతుంది. అయితే కొందరు వ్యక్తులు మాత్రం.. కొన్నిసార్లు పాములతో పరాచకాలు ఆడుతుంటారు. విష సర్పాలతో..

Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం పని..? బాత్రూంలోకి పామును తీసుకెళ్లి మరీ ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే..!

పామును చూస్తే.. స్నేక్ క్యాచర్లకు మినహా ఎవరికైనా చచ్చేంత భయం వేస్తుంది. పొరపాటున అవి దగ్గరగా వస్తే ఇక దాదాపు ప్రాణం పోయేంత పని అవుతుంది. అయితే కొందరు వ్యక్తులు మాత్రం.. కొన్నిసార్లు పాములతో పరాచకాలు ఆడుతుంటారు. విష సర్పాలతో వింత వింత ప్రయోగాలు చేసి.. చిరవకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న పాము వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి నాగుపామును ఏకంగా బాత్రూంలోకి తీసుకెళ్లాడు. చివరకు అతడు చేసిన పని చూసి.. ‘‘వామ్మో.. ఈ వ్యక్తికి ఎంత ధైర్యం’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన ఓ వీడియో (Snake viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కోబ్రాను (Cobra) చిన్న పిల్లల తరహాలో చూసుకోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పామును పట్టుకోవడమే కాదు.. ఏకంగా దాన్ని బాత్రూంలోకి తీసుకెళ్తాడు. అంతటితో ఆగకుండా దాన్ని బకెట్ పక్కన పెట్టి స్నానం (young man bathing a snake) చేయిస్తాడు. మగ్గుతో నీళ్లు తీసుకుని తల మీద పోయగానే బుసలు కొడుతున్న పాము కాటేయాల్సింది పోయి.. కామ్‌గా ఉండిపోతుంది. పాముపై చేయి పెట్టి రుద్ది మరీ స్నానం చేయిస్తాడు.

World's longest Python: అమ్మ బాబోయ్.. ఇదేంటి ఇంత పొడవుంది..? నేరుగా ఇంట్లోకి దూరిన కొండచిలువ..!

అయినా పాము మాత్రం అతన్ని ఏమీ అనదు. మధ్యలో ‘‘నాకు స్నానం వద్దు’’.. అంటూ మగ్గును నోటితో పట్టుకుని పక్కకు నెట్టేస్తుంది. అయినా అతను మాత్రం పాముకు బలవంతంగా స్నానం చేయిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. చివరకు పామును పసి పిల్లాడిని చేసి ఆడుకుంటున్నాడే... అని కొందరు, ఈ వ్యక్తికి ఎంత ధైర్యం బాబోయ్.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: బారీకేడ్స్‌ను పడేసి.. కార్లపైకి ఎక్కి పడుకుని మరీ నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ రచ్చ.. ప్రేమలో మోసపోయానంటూ..

Updated Date - 2023-03-28T19:52:22+05:30 IST