Viral News: ఎంత పని చేశావు తాతా..? ఆన్‌లైన్‌లో కళ్ళజోడు కొనేందుకు ప్రయత్నిస్తే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-03-29T17:43:17+05:30 IST

ఒక్క క్లిక్‌తో వస్తువులు ఇంటికి వచ్చి చేరే నేటి హైటెక్ యుగంలో నష్టాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. మరోవైపు సైబర్ నేరాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలపై అవగాహన లేని వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం..

Viral News: ఎంత పని చేశావు తాతా..? ఆన్‌లైన్‌లో కళ్ళజోడు కొనేందుకు ప్రయత్నిస్తే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా ముందుగా ఆన్‌లైన్‌లో వెతకడం, సదరు వస్తువుకు సంబంధించిన రివ్యూస్ చూడడం.. చివరగా తమకు కావాల్సిన వాటిని బుక్ చేసుకోవడం చేస్తుంటారు. కోరుకున్న వస్తువులు నేరుగా ఇంటికే రావడం, అందులోనూ వివిధ ఆఫర్లు ఉండడంతో.. ఆన్‌లైన్‌ ఆర్డర్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క క్లిక్‌తో వస్తువులు ఇంటికి వచ్చి చేరే నేటి హైటెక్ యుగంలో నష్టాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. మరోవైపు సైబర్ నేరాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలపై అవగాహన లేని వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ వృద్ధుడు కళ్లజోడు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయగా.. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి షేర్ చేసిన ఫొటో తెగ వైరల్ (Viral photos) అవుతోంది. తన తండ్రి చేసిన పొరపాటును వివరిస్తూ అతను ఓ ఫొటోను షేర్ చేశాడు. వృద్ధ దంపతులు తరచూ రీడింగ్ గ్లాసులను (Reading glasses) పొగొట్టుకుంటూ ఉండేవారు. దీంతో ఇటీవల వృద్ధుడు ఆన్‌లైన్‌లో (Online) రీడింగ్ గ్లాస్ కోసం సెర్చ్ చేశాడు. తనకు, తన భార్యకు కలిపి.. 10 లేదా 12 జతల గ్లాసెస్ తీసుకోవాలనేది అతడి ఉద్దేశం. అయితే బుక్ చేసే క్రమంలో అతడు చిన్న పొరపాటు చేశాడు.

Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!

old-man-trending-videos.jpg

12 జతల రీడింగ్ గ్లాస్‌లను బుక్ చేయాల్సింది పోయి.. 12 సెట్లపై క్లిక్ చేశాడు. దీంతో చివరకు అతడి ఇంటికి 12 సెట్ల రీడింగ్ గ్లాస్‌లు వచ్చి చేరాయి. ఒక్కో బాక్సులో 5గ్లాస్‌ల చొప్పున మొత్తం 60 రీడింగ్ గ్లాస్‌లు వచ్చాయి. దీంతో తన పొరపాటు తెలుసుకుని వృద్ధుడు నాలుక కరుచుకున్నాడు. తన తండ్రి చేసిన పొరపాటును వివరిస్తూ కొడుకు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం 2.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Wife- Husband: భార్యతో కలిసి పార్టీ చేసుకుంటుంటే ఇలా జరిగిందేంటి..? బాత్ టబ్‌లో ఇద్దరూ కూర్చుని ఉండగా..

Updated Date - 2023-03-29T17:43:17+05:30 IST