Wife- Husband: భార్యతో కలిసి పార్టీ చేసుకుంటుంటే ఇలా జరిగిందేంటి..? బాత్ టబ్‌లో ఇద్దరూ కూర్చుని ఉండగా..

ABN , First Publish Date - 2023-03-29T16:26:53+05:30 IST

ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒక డ్రింక్‌లో రెండు స్ట్రాలు, మూన్‌లైట్ డిన్నర్లు, బాత్ టబ్ స్నానాలు.. ప్రస్తుతం ప్రేమికుల మధ్య ఇలాంటివి సర్వ సధారణమైపోయాయి. కొందరు ప్రేమికులైతే సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఇక నవ దంపతులైతే ..

Wife- Husband: భార్యతో కలిసి పార్టీ చేసుకుంటుంటే ఇలా జరిగిందేంటి..? బాత్ టబ్‌లో ఇద్దరూ కూర్చుని ఉండగా..

ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒక డ్రింక్‌లో రెండు స్ట్రాలు, మూన్‌లైట్ డిన్నర్లు, బాత్ టబ్ స్నానాలు.. ప్రస్తుతం ప్రేమికుల మధ్య ఇలాంటివి సర్వ సధారణమైపోయాయి. కొందరు ప్రేమికులైతే సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఇక నవ దంపతులైతే వివాహానంతరం హనీమూన్ పేరుతో సరదాగా గడిపిరావడం కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో పలు షాకింగ్, తమషా ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దంపతుల మధ్య చోటు చేసుకున్న ఓ అనూహ్య ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దంపతులిద్దరూ బాత్ టబ్‌లో స్నానం చేస్తుండగా.. సడన్‌గా ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ (couples Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి హనీమూన్ (Honeymoon) వెళ్తాడు. అక్కడ ఇద్దరూ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేశారు. అనంతరం సరదాగా బాత్ టబ్ స్నానం (bath tub bathing) చేయాలని అనుకుంటారు. అనుకున్నదే తడవుడగా స్నానానికి సిద్ధమవుతారు. అయితే స్నానం చేస్తున్న క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. భర్త స్నానం చేస్తూ నీటి టెంపరేచర్‌ని చెక్ చేసే పనిలో ఉంటాడు. అతడి భార్య ఏదో పరధ్యానంలో ఉండగా.. ఆమె వెనుకే వెలుగుతున్న కొవ్వొత్తి మంట జుట్టుకు (Fires in the hair) అంటుకుంటుంది.

Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం పని..? బాత్రూంలోకి పామును తీసుకెళ్లి మరీ ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే..!

couples-viral-videos.jpg

క్షణాల వ్యవధిలో మంట మరింత పెద్దది అవుతుంది. గమనించిన భర్త తలపై నీళ్లు చల్లి ఆర్పేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే భయపడ్డ ఆమె.. అక్కడి నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మంటలు పూర్తిగా ఆర్పేందుకు ఆమెను మళ్లీ నీటిలో ముంచేస్తాడు. ఎట్టకేలకు మంటలు పూర్తిగా ఆరిపోవడంతో హమ్మయ్య!.. అని ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత ఊడిపోయిన జుట్టును చూస్తూ ఆమె తెగ బాధపడిపోతుంది. 2016లో జరిగిన ఈ ఘటనకు సంభందించిన వీడియోలు, ఫొటోలు.. ప్రస్తుతం నెట్టింట (Viral videos) వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!

Updated Date - 2023-03-29T16:26:53+05:30 IST