ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Funny Video: ఈ కుర్రాడెవరో కానీ.. కడుపుబ్బా నవ్వించేశాడుగా.. మెట్రో‌ రైల్లో ఇద్దరి మధ్య కూర్చుని సడన్‌గా షాకిచ్చాడు..!

ABN, First Publish Date - 2023-11-08T19:46:19+05:30

రైలు ప్రయాణం అంటేనే.. అదో వింత అనుభూతి. ప్రయాణికుల గందరగోళం ఓ వైపు, మరోవైపు వివిధ రకాల చిరుతిళ్లు, టీ తదితరాలను చిత్రవిచిత్రంగా పలుకుతూ విక్రయించే వాళ్లతో గోళగోళగా ఉంటుంది. అలాగే ఇంకోవైపు వచ్చీపోయే భిక్షగాళ్ల పాటలు వింటూ ప్రయాణికులు ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అయితే..

రైలు ప్రయాణం అంటేనే.. అదో వింత అనుభూతి. ప్రయాణికుల గందరగోళం ఓ వైపు, మరోవైపు వివిధ రకాల చిరుతిళ్లు, టీ తదితరాలను చిత్రవిచిత్రంగా పలుకుతూ విక్రయించే వాళ్లతో గోళగోళగా ఉంటుంది. అలాగే ఇంకోవైపు వచ్చీపోయే భిక్షగాళ్ల పాటలు వింటూ ప్రయాణికులు ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు యువతీయువకులు.. రీల్స్ వీడియోల కోసం రైలు బోగీలను కూడా వదలడం లేదు. చిత్రవిచిత్ర విన్యాసాలు, నృత్యాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ముంబై మెట్రో రైలుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు మెట్రో రైల్లో ప్రయాణికుల మధ్య కూర్చుని సడన్ షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ముంబై మెట్రో రైల్లో (Mumbai Metro train) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు మెట్రో రైలు ఎక్కిన కాసేపటికి అందరికీ షాకిచ్చాడు. ప్రయాణికుల మధ్య కూర్చుని ఒక్కసారిగా పాటలు అందుకున్నాడు. అది కూడా ప్రసిద్ధి చెందిన పాత ప్రకటనలకు (Old advertising songs) సంబంధించిన పాటలు పాడడంతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్కారు. ఇద్దరు, ముగ్గురు ఉన్న చోటకు వెళ్లి మధ్యలో కూర్చోవడం.. కాసేపటి తర్వాత పాటలు అందుకోవడం చేశాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, బాద్షా మసాలా, MDH మసాలా వంటి ప్రకటనలకు సంబంధించిన పాటలను బిగ్గరగా పాడడంతో అంతా అతన్నే గమనిస్తూ ఉన్నారు.

Shocking Video: చెల్లి మృతదేహాన్ని చున్నీతో కట్టుకుని.. బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లిన అన్న..!

కొందరైతే ‘‘ఎవడ్రా.. ఇతనూ.. పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నాడు.. వీడికేమైనా మెంటలా’’.. అన్నట్లుగా చూశారు. కొందరైతే వీడితో మనకెందుకులే.. అనుకుంటూ లేచి పక్కకు వెళ్లిపోవడం కనిపించింది. ఇలా అతను చాలా సేపు పాటలు పాడుతూనే ఉన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రకటనల పాటలతో అందరినీ భయపెట్టావు కదరా..’’ అంటూ కొందరు, ‘‘రీల్స్ కోసం కోతి చేష్టలు చేయడం ఎక్కువైపోయింది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇతడికి అమరగాయకుడు అవార్డు ఇవ్వాల్సిందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking Video: గోడకు వేళాడుతున్న జాకెట్.. కర్రపుల్లతో దాన్ని కదిపితే.. లోపలి నుంచి ఏం బయటకు వచ్చాయో చూస్తే..!

Updated Date - 2023-11-08T19:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising