ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకున్నాడో.. కోతికి ఆహారం తినిపిస్తూ.. ఇతడు ఏం చేశాడో చూస్తే..

ABN, Publish Date - Dec 31 , 2023 | 04:35 PM

కొందరు తమ పైశాచికత్వాన్ని మూగ జంతువులపై చూపిస్తుంటారు. తిరిగి దాడి చేయలేవనే భావనతో పదే పదే వాటిని హింసిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. అయినా...

కొందరు తమ పైశాచికత్వాన్ని మూగ జంతువులపై చూపిస్తుంటారు. తిరిగి దాడి చేయలేవనే భావనతో పదే పదే వాటిని హింసిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. అయినా చాలా మంది ఇలాంటి ఆకతాయి పనులకు పాల్పడుతుండడం చూస్తుంటాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కోతికి ఆహారం అందిస్తూ ఉన్నట్టుండి కోతిపై దాడి చేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇండోర్‌లో (Indoor) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి లోయ వద్ద పర్యటించే క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. లోయ పక్కనే ఉన్న ఇనుప రెయిలింగ్‌పై ఓ కోతి కూర్చుని ఉంటుంది. సదరు వ్యక్తి కోతిని చూడగానే చేతిలో (man feed monkey) ఆహారం పెట్టుకుని వెళ్తాడు. కోతికి ఎంతో ప్రేమతో అందిస్తాడు. ఆకలితో ఉన్న కోతి ఎంతో ఆతృతగా ఆహారాన్ని తింటూ ఉంటుంది. అయితే ఈ సమయంలో అతను దారుణానికి పాల్పడతాడు.

Viral Video: రైల్లో ఆకతాయిలకు పాఠాలు నేర్పిస్తున్న కుక్క.. స్టేషన్‌లో ఎలా డ్యూటీ చేస్తుందో చూడండి..

మధ్యలో ఒక్కసారిగా కోతిని చేత్తో గట్టిగా (man slapping monkey) కొడతాడు. దీంతో పాపం.. కోతి ఎగిరి లోయలో పడుతుంది. వెంటనే తేరుకుని అక్కడి నుంచి లోపలికి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో చివరకు ఫారెస్ట్ అధికారుల వరకూ చేరింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సదరు వ్యక్తిని గుర్తించేందుకు విచారిస్తున్నామని, అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహారం పేరుతో ఇతడు చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘మూగ జీవాలను హింసించడం నేరం’’.. అంటూ మరికొందరు, ‘‘ఆహారం తినే సమయంలో ఇలా చేయడం దారుణం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాముకు ముద్దు పెట్టిన ఇతను.. కుబుసం ఎలా తీసేస్తున్నాడో చూడండి..

Updated Date - Dec 31 , 2023 | 04:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising