Share News

Viral Video: రైల్లో ఆకతాయిలకు పాఠాలు నేర్పిస్తున్న కుక్క.. స్టేషన్‌లో ఎలా డ్యూటీ చేస్తుందో చూడండి..

ABN , Publish Date - Dec 30 , 2023 | 08:49 PM

చాలా విషయాల్లో మనుషుల కంటే జంతువులే ఎంతో నయం అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు చాలా జంతువులు మనుషులకు గురపాఠాలు కూడా నేర్పుతుంటాయి. ఇలాంటి..

Viral Video: రైల్లో ఆకతాయిలకు పాఠాలు నేర్పిస్తున్న కుక్క.. స్టేషన్‌లో ఎలా డ్యూటీ చేస్తుందో చూడండి..

చాలా విషయాల్లో మనుషుల కంటే జంతువులే ఎంతో నయం అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు చాలా జంతువులు మనుషులకు గురపాఠాలు కూడా నేర్పుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కుక్క వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రైల్లోని ఆకతాయిలకు ఓ కుక్క సడన్ షాక్ ఇచ్చింది. దగ్గరుండి మరీ వారికి ఎలా నడుచుకోవాలో నేర్పించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ కుక్కకు వెంటనే రైల్వేలో జాబ్ ఇవ్వాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది ఫుట్‌బోర్డ్ ప్రయాణం (Footboard travel) చేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయాణికులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు్ంటారు. కొందరైతే మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలా ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేసే వారికి ఓ కుక్క (dog) సరైన గుణపాఠం నేర్పించింది. రైల్వే స్టేషన్‌లో రైలు కదులుతుండగా.. సడన్‌గా ఓ కుక్క అక్కడికి ఎంటరైంది.

Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఫోన్‌లో యువతి వీడియో చూడగానే మారిన సీన్.. చివరకు..

రైలు బోగీలో డోరు వద్ద కూర్చున్న ప్రయాణికులను చూడగానే కుక్కకు కోపం కట్టలు తెంచుకుంది. ‘‘లోపలికి వెళ్తారా.. లేదా నోటికి పని చెప్పమంటారా’’.. అన్నట్లుగా వారిని కరుస్తున్నట్లు నటిస్తూ లోపలికి వెళ్లేలా చేస్తుంది. ఇలా అన్ని బోగీల దగ్గరికి వెళ్తూ యువకులను హెచ్చరిస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్కను చూసైనా అంతా నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘దీనికి రైల్వే సెక్యూరిటీ జాబ్ ఇవ్వాలి’’.. అంటూ మరికొందరు, ‘‘కుక్క చేసిన పనికి హ్యాట్సాప్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఇది మరీ దారుణం.. ఫొటోషూట్ పేరుతో హద్దులు దాటిన టీచర్.. విద్యార్థిని ముద్దు పెట్టుకుని మరీ..

Updated Date - Dec 30 , 2023 | 08:49 PM