Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాముకు ముద్దు పెట్టిన ఇతను.. కుబుసం ఎలా తీసేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Dec 29 , 2023 | 09:18 PM

పాములతో పరాచకాలు ఆడితే ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా కొందరు వాటిని ఇబ్బంది పెడుతూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. మరికొందరు మానవతా దృక్పథంతో ఆలోచించి, పాములను కాపాడి అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. ఇంకొందరు...

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాముకు ముద్దు పెట్టిన ఇతను.. కుబుసం ఎలా తీసేస్తున్నాడో చూడండి..

పాములతో పరాచకాలు ఆడితే ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా కొందరు వాటిని ఇబ్బంది పెడుతూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. మరికొందరు మానవతా దృక్పథంతో ఆలోచించి, పాములను కాపాడి అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. ఇంకొందరు వాటిని పట్టుకుని అందరికీ అవగాహన కల్పిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాముకు ముద్దు పెట్టడమే కాకుండా దాని కుబుసాన్ని కూడా తీసేస్తాడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో చూసి.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పామును పట్టుకుని, దాని కుబుసం తీయాలని ప్రయత్నిస్తాడు. అయితే ముందుగా దాని తలను పట్టుకున్న అతను.. చేత్తో చర్మాన్ని (man removed snake skin) కొద్ది కొద్దిగా తీసేస్తాడు. ఇలా తలపై ఉన్న కుబుసాన్ని తీసేసి, ప్రేమగా నిమురుతూ ముద్దు పెడతాడు. తర్వాత దాని మిగతా చర్మాన్ని కూడా సున్నితంగా తీసేస్తాడు. కొంత సేపటి తర్వాత పాముపై ఉన్న కుబుసాన్ని పట్టుకోగానే.. పాముకు ముందుకు కదులుతుంది.

Crime News: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కారు.. బైకులో వచ్చి వెనుకే ఆగిన యువకులు.. కాసేపటి తర్వాత ఏం జరిగిందంటే..

ఇలా ఈజీగా పాము కుబుసాన్ని తీసేస్తాడు. పూర్తి కుబుసం తీసేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పినట్లుగా... పాము అతడి వైపు ఓ లుక్ ఇస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాముకు శ్రమ తప్పించావ్... బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘చొక్కా విప్పినట్లు.. విప్పేశావ్ కదా భయ్యా’’.. అంటూ మరికొందరు, ‘‘వామ్మో! చూస్తుంటూనే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..

Viral Video: పాము ఎదురుగా.. అచ్చం కోబ్రాలాగే బుసకొట్టిన యువకుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Dec 29 , 2023 | 09:18 PM