Share News

Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Dec 28 , 2023 | 07:05 PM

‘‘పెళ్ళంటే పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ’’.. అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ వివాహ కార్యక్రమాన్ని చూసినా.. ‘‘అంతకు మించి’’.. అన్నట్లుగా జరుగుతుంటుంది. వరుడితో పోటీపడి వధువు చేసే పనులు కొన్నిసార్లు...

Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..

‘‘పెళ్ళంటే పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ’’.. అనేది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ వివాహ కార్యక్రమాన్ని చూసినా.. ‘‘అంతకు మించి’’.. అన్నట్లుగా జరుగుతుంటుంది. వరుడితో పోటీపడి వధువు చేసే పనులు కొన్నిసార్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి పీటలపైనే వరుడికి వధువు చుక్కలు చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో! ఈ పెళ్లికూతురు.. పెళ్లి రోజే వరుడికి చుక్కలు చూపించిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దండలు మార్చుకున్న అనంతరం వధూరులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటుంటారు. ఈ క్రమంలో ముందుగా వధువు వరుడికి స్వీటు తినిపించబోతుంది. అయితే అది తనకు నచ్చకపోవడంతో తినేందుకు నిరాకరిస్తాడు. అయినా వధువు మాత్రం బలవతం చేస్తుంది. అయినా వరుడు మాత్రం నోరు మూసుకుని అలాగే ఉండిపోతాడు. తర్వాత వరుడి వంతు వస్తుంది. ప్లేటులోని స్వీటు తీసుకుని, వరుడికి తినిపించబోతుంది.

Viral Video: అంతా ఇళ్లల్లో సామాన్లు తరిలిస్తే.. వీళ్లేమో ఏకంగా ఎంత పని చేశారో చూడండి..

అయితే వధువు కూడా స్వీటు తినేందుకు నిరాకరిస్తుంది. దీంతో వరుడికి కోపం వచ్చి స్వీటును బలవంతంగా ఆమె నోట్లో కుక్కేస్తాడు. అలా చేయడంతో వధువుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. నన్ను ఇంత ఇబ్బంది పెడతావా.. అంటూ గట్టిగా కొడుతుంది. దీంతో వరుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లి మంటపం నుంచే పెత్తనం మొదలైందన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘మున్ముందు రోజుల్లో వరుడి పరిస్థితి ఏంటో అర్థమైంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: విషం ఉండదని కొండచిలువను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - Dec 28 , 2023 | 07:05 PM