Share News

Viral Video: వామ్మో! యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. సైకిల్‌పై ఈమె చేసిన స్టంట్ చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:02 PM

కొందరు యువతులు వివిధ పనుల్లో యువకులతో పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు మగవాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు యువతులు చేసే విన్యాసాలు.. చూడాలంటేనే భయం పుట్టించేలా ఉంటాయి. ఇలాంటి...

Viral Video: వామ్మో! యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. సైకిల్‌పై ఈమె చేసిన స్టంట్ చూస్తే.. షాకవ్వాల్సిందే..

కొందరు యువతులు వివిధ పనుల్లో యువకులతో పోటీ పడుతుంటారు. కొన్నిసార్లు మగవాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు యువతులు చేసే విన్యాసాలు.. చూడాలంటేనే భయం పుట్టించేలా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి సైకిల్‌పై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్అవుతోంది. ఓ యువతి సైకిల్‌పై విన్యాసం (young woman doing stunts on bicycle) చేసేందుకు సిద్ధమవుతుంది. అందరిలాగానే ఏదో సాదాసీదాగా చేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ ఆమె సైకిల్ ఎక్కీ ఎక్కగానే.. అందరినీ ఒక్కసారిగా భయపెట్టేసింది. సైకిల్‌ను అత్యంత వేగంగా తొక్కడమే కాకుండా పాములా అటూ, ఇటూ తిప్పుతూ కిందపడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ముందు చక్కాన్ని పైకి లేపి అంతే వేగంగా అటూ ఇటూ తిప్పుతూ దూసుకుపోతుంది. వెళ్లే క్రమంలో రోడ్డుపై అగ్గి రవ్వలు పుట్టిస్తుంది.

Viral Video: పాము ఎదురుగా.. అచ్చం కోబ్రాలాగే బుసకొట్టిన యువకుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న వ్యక్తుల వద్దకు వేగంగా వెళ్లి.. అత్యంత సమీపానికి వెళ్లగానే ఒక్కసారిగా పక్కకు తిప్పేస్తుంది. ఇలా ఒకే చక్రంపై వేగంగా వెళ్తూనే కాళ్లను హ్యాండిల్‌పై ఉంచి బ్యాలెన్స్ చేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి స్టంట్ యువకులకూ సాధ్యం కాదేమో’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! ఈమేంటీ మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉందే’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ స్టంట్ చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..

Updated Date - Dec 29 , 2023 | 06:02 PM