Share News

Viral Video: ఈ సైకిల్ ఇలా ఎందుకు ఉందబ్బా..! వింత సైకిల్‌ను చూసి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:35 PM

వింత వింత వస్తువులు, వాహనాలు తయారు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు ఆటోలను కార్ల తరహాలో మారిస్తే.. మరికొందరు కార్లను వింత వింత ఆకారాల్లో తయారు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు...

Viral Video: ఈ సైకిల్ ఇలా ఎందుకు ఉందబ్బా..! వింత సైకిల్‌ను చూసి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

వింత వింత వస్తువులు, వాహనాలు తయారు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు ఆటోలను కార్ల తరహాలో మారిస్తే.. మరికొందరు కార్లను వింత వింత ఆకారాల్లో తయారు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు మరో అడుగు ముందుకేసి వినూత్నంగా ఆలోచించి.. చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేయడం కూడా చూస్తుంటాం. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి ఐడియాలనే వచ్చింది. వినూత్న రీతిలో తయార చేసిన సైకిల్‌.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది. వెంటనే సదరు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌ను వినూత్నంగా తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. సాధారణంగా ఏ వాహనానికైనా టైర్లు గుండ్రంగా ఉండడం సర్వసాధారణం. టైర్ల విషయంలో ఎన్ని మార్పులు చేసినా.. వాటి ఆకారం మాత్రం ఎవరూ మార్చలేరు. ఒకవేళ మార్చినా వాటిని వినియోగించడం సాధ్యం కాదు. అయితే ఈ వ్యక్తి మాత్రం దాన్ని ఆచరణలో చేసి చూపించాడు. సైకిల్‌కి గుండ్రటి టైర్లు కాకుండా చతురస్రాకారంలో (square tires bicycle) ఉన్న టైర్లను ఏర్పాటు చేశాడు.

Viral Video: వామ్మో! యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. సైకిల్‌పై ఈమె చేసిన స్టంట్ చూస్తే.. షాకవ్వాల్సిందే..

టైర్లకు ఓ చైన్ ఫిట్ చేయడంతో సైకిల్ తొక్కడం ద్వారా చైన్ ముందుకు వెనక్కూ కదులుతాయి. ఇలా చతురస్రాకార టైర్లతో సైకిల్‌పై రయ్యిన దూసుకుపోతున్నాడు. ఈ సైకిల్ ఆనంద్ మహీంద్రాను (Anand Mahindra) విపరీతంగా ఆకట్టుకుంది. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ‘‘నాకో సందేహం.. ? ఇలా ఎందుకు..!’’.. అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎవరయ్యా.. ఈ సైకిల్ తయారు చేసిన మహానుభావుడు’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాము ఎదురుగా.. అచ్చం కోబ్రాలాగే బుసకొట్టిన యువకుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Dec 29 , 2023 | 06:35 PM