Share News

Viral: ఇది మరీ దారుణం.. ఫొటోషూట్ పేరుతో హద్దులు దాటిన టీచర్.. విద్యార్థిని ముద్దు పెట్టుకుని మరీ..

ABN , Publish Date - Dec 29 , 2023 | 09:46 PM

ప్రస్తుత రోజుల్లో పెద్దా, చిన్నా, గురువు, దైవం.. అనే గౌరవ మర్యాదలు కనుమరుగవుతున్నాయి. కొందరు పిల్లలు పెద్దల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటే.. ఇంకొందరు పెద్దలు కూడా తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారు. ఇక...

Viral: ఇది మరీ దారుణం.. ఫొటోషూట్ పేరుతో హద్దులు దాటిన టీచర్.. విద్యార్థిని ముద్దు పెట్టుకుని మరీ..

ప్రస్తుత రోజుల్లో పెద్దా, చిన్నా, గురువు, దైవం.. అనే గౌరవ మర్యాదలు కనుమరుగవుతున్నాయి. కొందరు పిల్లలు పెద్దల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటే.. ఇంకొందరు పెద్దలు కూడా తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారు. ఇక పిల్లలకు విద్యాబుద్దులు నేర్చించి, వారిని సరైన మార్గంలో నడిపించే గౌరవప్రదమైన స్థానంలో ఉన్న కొందరు టీచర్లు కూడా దారి తప్పుతున్నారు. విద్యార్థులతో కలిసి రాసలీలలు సాగించే ఎంతో మంది టీచర్లను తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ టీచర్ తన స్టూడెంట్‌తో కలిసి హద్దులు మీరి ప్రవర్తించింది. షొటోషూట్ పేరుతో వారు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కర్నాటకలోని (Karnataka) మురుగమల్ల చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు, టీచర్లు టూర్‌కు వెళ్లారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. పర్యాటక ప్రదేశాల గురించి విద్యార్థులకు వివిరించి, అవగాహన కల్పించాల్సిన ఓ టీచర్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఫొటో షూట్ పేరుతో పదో తరగతి విద్యార్థితో కలిసి (Teacher misbehaving with student) అసభ్యకరంగా ప్రవర్తించింది. ఓ అటవీ ప్రాంతంలో వారు ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థితో కలిసి ఓ టీచర్ ఫొటోలు దిగింది. అయితే ఈ సందర్భంగా విద్యార్థి టీచర్‌ను ప్రియురాలి తరహాలో పైకి ఎత్తుకున్నాడు. అంతటితో ఆగకుండా వధూవరుల తరహాలో వివిధ భంగిమల్లో ఇద్దరూ ఫొటోలు దిగారు.

Viral Video: ఈ సైకిల్ ఇలా ఎందుకు ఉందబ్బా..! వింత సైకిల్‌ను చూసి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

మధ్యలో విద్యార్థి తన టీచర్‌కు పువ్వు అందించి ముద్దు పెట్టాడు. ఇది తప్పని చెప్పాల్సింది పోయి.. ఆమె కూడా తిరిగి అతడికి ముద్దు పెట్టి అందరి ఆగ్రహానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెసింది. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థి, టీచర్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ టీచర్ తన విద్యార్థికి ప్రేమ పాఠాలు నేర్పుతోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే సమాజం పాడవుతోంది’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఇలాంటి టీచర్లను కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాముకు ముద్దు పెట్టిన ఇతను.. కుబుసం ఎలా తీసేస్తున్నాడో చూడండి..

Updated Date - Dec 29 , 2023 | 09:46 PM