ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: బీబీసీ ఛైర్మన్‌గా ఎన్నారైని నామినేట్ చేసిన యూకే.. అసలు ఎవరీ సమీర్ షా...

ABN, First Publish Date - 2023-12-08T08:50:35+05:30

New BBC Chairman Dr Samir Shah: ఇప్పటికే వివిధ దేశాల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నత స్థానాలను అధిరోహించడం జరిగింది. దిగ్గజ సాప్ట్‌వేర్ సంస్థలకు బాస్ నుంచి మొదలుకొని దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఎన్నారై వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.

New BBC Chairman Dr Samir Shah: ఇప్పటికే వివిధ దేశాల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నత స్థానాలను అధిరోహించడం జరిగింది. దిగ్గజ సాప్ట్‌వేర్ సంస్థలకు బాస్ నుంచి మొదలుకొని దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఎన్నారై వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. యూకే ప్రభుత్వం బీబీసీ (BBC) కొత్త ఛైర్మన్‌గా బ్రాడ్‌కాస్టింగ్‌లో 40ఏళ్ల అనుభవం ఉన్న టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ సమీర్ షా (Samir Shah) ను నామినేట్ చేసింది. పార్లమెంటరీ కమిటీ ఆమోదిస్తే ఎన్నారై సమీర్ షా బీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. కాగా, ఇంతకుముందు ఛైర్మన్‌గా పనిచేసిన రిచర్డ్ షార్ప్ (Richard Sharp) ఈ ఏడాది ఏప్రిల్‌లో తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఇప్పుడు రిషి సునాక్ ప్రభుత్వం దీన్ని ఎన్నారై సమీర్ షాతో భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లోన్ ఇవ్వడంలో ప్రమేయం ఉందని రిచర్డ్ షార్ప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి: NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

అసలు ఎవరీ సమీర్ షా...

ఔరంగాబాద్‌లో జన్మించిన సమీర్ షా 1960లో ఇంగ్లండ్‌ వెళ్లారు. ఆ తర్వాత ఆయన 1979లో లండన్ వీకెండ్ టెలివిజన్‌లో తన కెరీర్ ప్రారంభించారు. బీబీసీలో కరెంట్ అఫైర్స్ హెడ్, రాజకీయ కార్యక్రమాలకు అధిపతిగా ఉన్నారు. అలాగే ఇతర కొన్ని కీలక పదవులలో బాధ్యతలు నిర్వర్తించారు. దీంతోపాటు 2007 నుంచి 2010 వరకు బీబీసీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఒకవేళ ఆయన బీబీసీ ఛైర్మన్‌గా ఎన్నికైతే వారానికి మూడు రోజుల పని విధానంలో రూ.1.67కోట్ల వార్షిక జీతం అందుకుంటారని సమాచారం. ఇక బీబీసీ ఛైర్మన్‌గా తనను ప్రభుత్వం నామినేట్ చేయడం పట్ల సమీర్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఎంతో గర్వించదగిన విషయమని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నియామక ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టవచ్చని అధికారిక వర్గాల సమాచారం.

ఇది కూడా చదవండి: Kuwait News: కీలక బిల్లుకు ఆమోదం.. కువైత్‌లో ప్రవాసులకు ఇకపై రెసిడెన్సీ, వ్యాపారం అంత ఈజీ కాదు!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-08T08:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising