Share News

NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

ABN , First Publish Date - 2023-12-07T10:53:19+05:30 IST

Indian Man Dies In Australia: దేశం కాని దేశంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య (NRI Wife) విన్నవిస్తోంది.

NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

Indian Man Dies In Australia: దేశం కాని దేశంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య (NRI Wife) విన్నవిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సోమవారం రాత్రి 11.15 గంటలకు (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) ఎన్నారై ఖుష్‌దీప్ సింగ్ (26) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఖుష్‌దీప్ ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు మెల్‌బోర్న్ పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Kuwait News: కీలక బిల్లుకు ఆమోదం.. కువైత్‌లో ప్రవాసులకు ఇకపై రెసిడెన్సీ, వ్యాపారం అంత ఈజీ కాదు!

కాగా, అతడు గత కొంతకాలంగా మెల్‌బోర్న్‌లో ట్రక్ డ్రైవర్ (Truck driver in Melbourne) పనిచేస్తున్నట్లు తెలిసింది. ఏడాది క్రితమే ఖుష్‌దీప్ భార్య జప్‌నీత్ కౌర్ (Japneet Kaur) ఉన్నత చదువుల కోసం మెల్‌బోర్న్‌ వెళ్లింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. భర్త రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో కౌర్ కన్నీరుమున్నీరు అవుతోంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని కోరుతోంది. దీనికోసం 'గోఫండ్‌మీ' (GoFundMe) పేజీ క్రియేట్ చేసి, విరాళాలు సేకరిస్తోంది. చిన్న మొత్తమైన పర్లేదు, మీకు తోచిన సాయం చేయాలని దాతలను ఆమె అభ్యర్థిస్తోంది.

ఇది కూడా చదవండి: Kuwait News: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. కువైత్‌లో ఉండగా ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-07T10:54:41+05:30 IST